calender_icon.png 18 December, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోడిపుంజుకు అత్యవసర శస్త్రచికిత్స

18-12-2025 12:24:45 AM

అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య

కోదాడ, డిసెంబర్ 17: చిలుకూరు మండల కేంద్రానికి చెందిన కోడిపుంజుల పెంపకందారు నవీన్ తన ఆరు కిలోల కోడిపుంజు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో బుధవారం కోదాడ పశువైద్యశాలకు తీసుకవచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య వెంటనే అత్యవసర శస్త్ర చికిత్స చేయడంతో కోలుకుంది.

ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య మాట్లాడుతూ కోడిపుంజు యజమాని నవీన్ బలం కోసం కోడిపుంజుకు మటన్ తినిపించడంతో, ముక్కలు బొరిగలో ఇరుక్కపోయి, ఏం తినలేక అనారోగ్యానికి గురైందన్నారు. సమస్య గుర్తించి శస్త్రచికిత్స ద్వారా బొరిగను శుభ్రం చేసినట్లు వివరించారు. నాణ్యత గల దాణా వాడాలని సూచించారు. శస్త్ర చికిత్సలో సిబ్బంది రాజు, అఖిల్, హరికృష్ణ పాల్గొన్నారు.