17-12-2025 12:04:02 AM
గుర్రాలగొంది ప్రజలకు రుణపడి ఉంటా
సిద్దిపేట రూరల్, డిసెంబర్ 16: ప్రజాసేవే ప్రధాన లక్ష్యమని సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ అన్నారు. గ్రామ సర్పంచ్ గా ఎంపికైన సందర్భంగా గ్రామస్తులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, వివిధ పార్టీల నాయకులు మంగళవారం గ్రామంలోని ఆయన స్వగృహంలో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగాల వైపు వెళ్లకుండా గ్రామస్తులకు సేవ చేయాలని లక్ష్యంతో రాజకీయ ప్రవేశం చేసినట్లు చెప్పారు.
ఎంపీటీసీగా గ్రామానికి అందించిన సేవలను గుర్తించిన ఓటర్లు సర్పంచ్ అవకాశం కల్పించారని అందుకు గ్రామస్తులకు రుణపడి ఉంటానని తెలిపారు. తన గెలుపుకు కృషిచేసిన సహచారులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.