calender_icon.png 13 September, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

13-09-2025 12:44:15 AM

-అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు

-ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసే కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేలు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),సెప్టెంబర్12:  రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని,అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని తుంగ తుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శుక్రవారం మండలంలోని లోయపల్లి, సూర్యనాయక్ తండా, కోమటిపల్లి గ్రామా ల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు ముగ్గు పోసే కార్యక్రమంతో పాటు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని,ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.లబ్ధిదారులకు విడతల వారీగా రూ.5లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ నెరవేరుస్తుందని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వద్దని,ఎవరైనా తీసుకుంటే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.

కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ గోపి,హౌసింగ్ పీడీ సిద్ధార్థ, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపాక సత్యం, శిగ నసీర్ గౌడ్, సతీష్ రెడ్డి, నర్సింగ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సామా అభిషేక్ రెడ్డి,జిల్లా నాయకులు గుడిపెల్లి మధుకర్ రెడ్డి,రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కో-ఆర్డినేటర్ జీడి వీరస్వామి,పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి,వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు,మాజీ సర్పంచ్లు,ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.