13-09-2025 12:45:21 AM
డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి
మునుగోడు,సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకం ప్రైవేట్ పాఠశాలల తీరు జరుగుతున్న సంబంధిత అధికారులు చొరవ తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని డివైఎఫ్‌ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు.మండల కేంద్రంలో ప్రభుత్వా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు పాఠశాలలు రవాణా సౌకర్యం పేరుతో బస్సులను కనీస భద్రత లేకుండా నడిపిస్తున్నారని డివైఎఫ్‌ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంఈఓ టి. మల్లేశానికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు.
కేంద్రంలో ప్రవేట్ పాఠశాలల బస్సులు సీట్ల పరిమితికి మించి విద్యార్థులను రవాణా చేస్తున్నాయని ఆరోపించారు. ఒక్కొక్క బస్సులో 30 నుంచి 35 మంది విద్యార్థులు ప్రయాణించాల్సిన సీట్ల పరిమితి ఉంటే ప్రస్తుతం ఆ బస్సుల్లో 70 మంది విద్యార్థులను రవాణా చేస్తున్నారని అన్నారు. కనీసం బస్సుల నుంచి విద్యార్థులను ఎక్కించడానికి, దించడానికి క్లీనర్స్ కూడా లేరని, సైడ్ విండోస్ కి కనీసం జాలీలను కూడా కొన్ని బస్సులకు ఏర్పాటు చేయకపోవడం వల్ల రహదారి వెంబడి చెట్ల కొమ్మలు తగిలి విద్యార్థులకు గాయాలైన పరిస్థితులు కూడా గతంలో చూసామని గుర్తు చేశారు.
సెయింట్ జోసఫ్ పాఠశాల యాజమాన్యం డబ్బుంటే ఏమైనా చేయొచ్చని రీతిలో రవాణా పేరుతోటి పేద విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక రవాణా చార్జీలను వసూలు చేస్తుందని ఆరోపించారు. దూర ప్రాంతాల విద్యార్థుల రవాణా పేరుతో ఉదయం 7 గంటల ప్రాంతంలోనే బస్సు రవాణా ప్రారంభమై, సాయంత్రం ఏడు వరకు కూడా విద్యార్థులు ఇంటికి చేరుకునే పరిస్థితి లేదన్నారు. డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ముందు ముందు స్వయంగా బస్సులను అడ్డుకొని విద్యా దోపిడీకి అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించారు. అధికారులు సైతం ఈ బస్సులపై చర్యలు తీసుకొని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు బొడ్డుపల్లి నరేష్, యాసరాని వంశీకృష్ణ, మండల ఉపాధ్యక్షులు యాట శ్రీకాంత్, సింగారం శ్యామ్, మహేందర్ ఉన్నారు.