calender_icon.png 19 September, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాప్ డిజైన్ లీడర్‌గా హైదరాబాద్

19-09-2025 12:11:18 AM

  1. ఏఐ టెక్నాలజీకి హైదరాబాద్ గ్లోబల్ సెంటర్
  2. డిజైన్ సామాజిక మార్పునకు ఆయుధం కావాలి 
  3. యూఎక్స్ ఇండియా--25 అంతర్జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): యాప్ డిజైన్ లీడర్‌గా హైదరాబాద్‌ను నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. యూఎం వో ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్‌లో ‘యూఎక్స్ ఇండి యా-25’ పేరుతో ఏర్పాటు చేసిన 21వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ప్రోడక్ట్ డిజైన్‌ను ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు.

హైదరాబా ద్ నగరం ఎలాంటి టెక్నాలజీనైనా అందిపుచ్చుకొని లీడర్‌గా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశా రు. ఏఐ టెక్నాలజీకి హైదరాబాద్ మహా నగరాన్ని గ్లోబల్ సెంటర్‌గా నిలబెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు క్యాబినెట్ పట్టుదలతో ఉందన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసిన ప్రతినిధులు హైదరాబాద్ వాతావరణం, సంస్కృతి, కళ లు, ఆహారం అన్నింటినీ ఆస్వాదించాలని, ప్రతినిధులు ఈ రాష్ర్టంలో ప్రధానంగా టెక్నాలజీ రం గంలో గుర్తించిన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ప్రతినిధులను కోరారు.

డిజైన్ అనేది కేవలం అందానికి సంబంధించింది కాదని అది సామాజిక మార్పునకు ఆయుధం కావాలని ఉద్బోద్ధించారు. తెలంగాణ ప్రభుత్వం సమాన త్వం, అభివృద్ధిని ప్రోత్సహిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ డిజైన్ క్యాపిటల్‌గా మార్చడానికి కలిసి పని చేద్దామని ప్రతినిధులకు డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. ఈ అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్ చరిత్రలో ఒక మలుపు రాయిగా అభివర్ణించారు.

తెలంగాణ రాష్ర్ట డిజిట ల్ భవిష్యత్‌ను పరిపుష్ఠం చేయడంలో, మరో అడు గు ముందుకు వేయడంలో కీలక పాత్ర పోషిస్తోందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్‌లు మన జీవితాల్లో అనివార్యమైనవి, కానీ ఒక యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటేనే అది విజయవంతమవతుందన్నారు. తెలంగాణ ప్రభు త్వం డిజిటల్ ఇంక్లూజన్‌లను ప్రోత్సహిస్తుందని, టీఎస్-ఐపాస్ వంటి పాలసీల ద్వారా స్టార్టప్‌లకు చేయూతనిస్తోందని వెల్లడించారు.

భారతదేశంలో యూపీఐ వంటి యాప్‌లు సరళంగా రూపొందించడంతో పెద్ద విజయం సాధ్యమైందన్నారు. ప్రాం తీయ భాషల్లోనూ యాప్‌లు రూపొందించడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు సులభంగా ఉపయోగించుకొనే అవకాశం ఉంటుందన్నారు.

త్వరలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ డిజైన్: మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్‌ను గ్లోబల్ డిజైన్ హబ్‌గా మార్చాలనే సంకల్పంతో త్వరలోనే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ డిజైన్‌ను ప్రారంభించనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బా బు చెప్పారు. టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్ లాంటి సంస్థల ద్వారా తెలంగాణను ఇన్నోవేషన్ హబ్ గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ‘ఏఐ ఇన్నోవే షన్ హబ్‌లో డిజైనింగ్‌కు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. డిజైనింగ్ అంటేనే సృజనాత్మకత అని, కాకపోతే.. అది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. అప్పుడే ఆ యాప్ లేదా వెబ్‌సైట్ మనుగడ సాధిస్తోందని చెప్పారు. ఈ ప్రక్రియలో ఏఐ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ వల్ల ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా చూడాలని సూచించారు. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే అంకుర సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నామన్నారు.