21-08-2025 12:35:36 AM
- జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
- ఆరోగ్య శ్రీ, సీఎం రిలిఫ్ ఫండ్‌లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
- ఆసుపత్రులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
- ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ఖమ్మం, ఆగస్టు 20 (విజయ క్రాంతి): ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణలో నిబంధన లు తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్థాని క సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి ప్రైవేట్ డాక్టర్లు, ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ లకు బుధవారం ఏర్పా టు చేసిన అవగాహన, శిక్షణా కార్యక్రమం లో పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ వైద్య రంగానికి సం బం ధించి చట్టాల పట్ల ప్రైవేట్ ఆసుపత్రుల వా రికి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, హాస్పిటల్ మేనేజ్మెంట్ సి స్టం (హెచ్.ఎం. ఎస్.), వైద్య ఖర్చుల ని యంత్రణ, పిసి పి.ఎన్.డి.టి., క్లినికల్ ఎస్టాబ్లి ష్మెం ట్, ఎంటిపీ యాక్ట్, ఐ.వి.ఎఫ్. సరోగసి నియమాలు పాటిస్తూ నాణ్యమైన సేవలు ప్రజల కు అందించాలనే ఉద్దేశ్యంతో సంబంధిత చ ట్టాలపై ట్రైనర్ల ద్వారా శిక్షణ అందిస్తున్నామ ని అన్నారు.
మన వాహనాలకు ఏ విధంగా రిజిస్ట్రేషన్, లైసెన్స్ తీసుకుంటామో, అదే వి ధంగా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తప్పనిసరిగా వంద శాతం క్లినికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ క్రింద రిజిస్టర్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపా రు.ప్రైవేటు ఆసుపత్రులు పాటించాల్సిన నిబంధనలు ప్రభుత్వం నిర్ణయిస్తుందని అ న్నారు.
ప్రతి ఆసుపత్రిలో వివిధ వైద్య సేవలకు వసూలు చేసే ఫీజుల వివరాలు, ధరల పట్టిక ప్రదర్శించాలని అన్నారు. నిరుపేదల కు ఎంపానెల్మెంట్ ఆసుపత్రులలో 10 లక్షల రూపాయల చికిత్స అందించాలని ప్రభు త్వం ఆరోగ్య శ్రీ పథకం అమలు చేస్తుందని, ఈ పథకం పట్ల అక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఒకే చికిత్సకు సీఎం రిలిఫ్ ఫండ్, ఆరోగ్య శ్రీ రెండు చోట్ల క్లెయిమ్స్ చే స్తున్నారని, ఈ పద్దతి మారాలని అన్నారు.
ఐ.వి.ఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ నిర్వహణలో ని బంధనలు పాటించాలని అన్నారు. హైదరాబాద్ కేసులో టెస్ట్ ట్యూబ్ బేబి నుంచి మా నవ రవాణా వరకు తప్పులు జరిగాయని, అటువంటివి నివారించేందుకు మనం నిబంధనలు పాటించాలని అన్నారు. ఫర్టిలిటి సెం టర్, ఐ.వి.ఎఫ్. క్లినిక్, జెనెటిక్ కౌన్సిలింగ్, న ర్సింగ్ హోమ్, డయాగ్నొస్టిక్, స్పీచ్ థెరపీ వంటి అనేక రకాల ఆసుపత్రులు వస్తున్నాయని, వీరందరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు.
స్పీచ్ థెరపీ పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అక్కడ క్వా లిఫైడ్ వైద్యులు ఉన్నారా వంటి అంశాలు పరిశీలన చాలా అవసరమని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. బి. కళావతి బాయి, డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ రాజశేఖర్ గౌడ్, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. చందు నాయక్, డా. వెంకట రమణ, డి ప్యూటీ డిఎంహెచ్‌ఓ., స్టేట్ టి.ఓ.టి. లు డా. కల్పన తోరన్, ఎస్.ఎం.ఓ. డా. మురారి రా జేంద్రప్రసాద్, డాక్టర్ నారాయణ మూర్తి, ప్రభుత్వ, ప్రైవేట్ గైనకాలాజిస్టులు, రేడియోలజిస్టులు, డాక్టర్లు, హాస్పటల్ మేనేజింగ్ డై రెక్టర్లు, డెమో సుబ్రహ్మణ్యం, స్థాటస్టికల్ ఆఫీసర్ నవీన్ కుమార్, డిపిఎం. దుర్గ, హెల్త్ ఎడుకేటర్ అన్వర్, డిడిఎం. నాగరాజు, డిఎస్‌ఓ వేణు, సంబంధిత అధికారులు, తదిత రులు పాల్గోన్నారు.