calender_icon.png 21 August, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంచం ఇస్తేనే ఫైల్ ముందుకు!?

21-08-2025 12:35:04 AM

  1. లంచం లేనిదే ఒక్క ఫైల్ కూడా ముందుకు దాటదు 

ఒక్కొక్కటిగా బయటపడుతున్న అధికారుల ఆగడాలు 

తాండూరు ,20 ఆగస్టు, (విజయక్రాంతి) వికారాబాద్ జిల్లా ...తాండూర్ మున్సిపల్ కార్యాలయం అవినీతి అక్రమాలకు అడ్డగా మారింది.కనీసం జనన ధ్రువీకరణ పత్రం, మరణ ధ్రువీకరణ పత్రం  కావాలన్నా  అధికారుల చెయ్యి తడపాల్సిందే లేదంటే కార్యా లయం చుట్టూ తిరగాల్సిందే. ఇక ఇంటి ని ర్మాణం చేపట్టేందుకు అనుమతుల కోసం ఆ స్తి మోటేషన్ జరగాలన్న, ఇంటి నంబర్ కో సం  వేలల్లో కాసులు సమర్పిస్తే తప్ప పను లు కావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 

మరోవైపు జి ప్లస్ వన్ భవన నిర్మా ణం కోసం అనుమతులు తీసుకొని నాలుగు ఐదు అంతస్తుల భవనాలు నిర్మాణం చేపడుతున్న అటువైపు సంబంధిత మున్సిపల్ అధి కారులు కన్నెత్తి చూడరు. ఎందుకంటే అక్ర మ నిర్మాణాలు చేపడుతున్న వారి వద్ద నుండి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఇలాంటి నిర్మాణాలు తాండూర్ ప ట్టణంలో కోకల్లలు. తాజాగా ఇంటి నంబర్ కేటాయించేందుకు సీనియర్ అసిస్టెంట్ బి జ్జు రమేష్ 15 వేల రూపాయలు లంచం తీ సుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.

అక్రమ వసూళ్ల వెనుక మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి హ స్తం ఉన్నట్టు విమర్శలు వినవస్తున్నాయి. ఏ సీబీ  దాడుల తర్వాత మున్సిపల్ అధికారు ల అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాండూరు పట్టణానికి చె ందిన ఇర్షాద్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో దాడులు నిర్వహించా రు.

ఈ సందర్భంగా తనను కలిసిన మీడి యా ప్రతినిధులతో మాట్లాడుతూ మున్సిప ల్ శాఖ ఒకటే కాదు అన్ని ప్రభుత్వ శాఖ ల లో  అవినీతి అధికారుల ఆగడాలు పెచ్చు మీరి పోతున్నాయని  మున్సిపల్ అధికారు ల వేధింపులు భరించలేకనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నాడు.

ప్రజలు చైతన్యం అవుతున్నారని ఆయా శాఖల అధికారులు పనితీరు మార్చుకొని ప్రజలకు నిజాయితీగా సేవలు అందించాలని, లేదంటే ఏదో ఒక రోజు ఏసీబీ అధికా రుల దాడులు తప్పవనిహితవుపలికాడు.