17-11-2025 01:07:35 AM
-వామనరావు దంపతుల హత్య కేసులో విచారణ
-హాజరు కావాలని మధుకు సీబీఐ నోటీసులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ లో సంచలనం సృష్టించిన హైకో ర్టు న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణిల జంట హత్యల కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదు ర్కొంటున్న మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పుట్ట మధు సోమవారం సీబీఐ విచారణకు హాజరుకా నున్నారు.
విచారణకు రావాలని సీబీ ఐ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. 2021 ఫిబ్రవరిలో పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద కారులో ప్రయాణిస్తున్న న్యాయవాద దంపతు లు వామనరావు, నాగమణిలను కొందరు దుండగులు నడిరో డ్డుపై అడ్డగించి, వేట కొడవళ్లతో దారుణంగా నరికి హత్య చేశారు. ఈ ఘట న రాష్ర్టవ్యాప్తంగా తీవ్ర కలకలం రే పింది.
మరణించే ముందు, వామనరావు ఈ హత్య వెనుక పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను పేరును చెప్ప డం ఈ కేసులో కీలక మలుపుగా మా రింది. మొదట ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేసి, పలువురు నిందితులను అరెస్టు చేశారు. అయి తే, ఈ హత్య వెనుక పెద్దల హస్తం ఉంద ఠని, ముఖ్యంగా పుట్ట మధు ప్రమేయం ఉందని వామనరావు కుటుంబ సభ్యులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు.
స్థానిక పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని, కేసును సీబీఐకి అప్పగించాలని వారు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, కోర్టు ఆదేశాల మేరకు గత రెండు నెలలుగా ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు, పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును కూడా సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు.
వా రి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే, తాజాగా పుట్ట మధును విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పుట్ట మధు నుంచి ఎలాంటి స మాచారం రాబడతారు. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది అనేది ఉత్కంఠగా మారింది.