calender_icon.png 1 February, 2026 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలలో గుణాత్మక చైతన్యం

25-09-2024 12:00:00 AM

బీసీల ఓట్లతో గెలిచిన అగ్ర, ఆధిపత్య వర్గాల ఎమ్మెల్యేలు, ఎం పీలు కుల జనగణన మీద విషం కక్కు తూ ఆ సమగ్ర ప్రక్రియను పక్క దారి పట్టించేలా కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ కుల జనగణన విషయంలో చిత్తశుద్ధి చాటుకొని బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్స్ కల్పించలేకపోతే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో భారీ నష్టాన్ని చవిచూడక తప్పదు. 

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ బీసీలకు చట్టసభలలో 33% రిజర్వేషన్స్ కలిపించాల ని తీర్మానం చేసి దానిని కేంద్రానికి పం పుతామని చెప్పడం పేర్కొంది. మరోవైపు కేటీఆర్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అ మలు చేయాలని, లేకపోతే బీఆర్‌ఎస్ పా ర్టీ కార్యాచరణ ప్రకటిస్తుందని ప్రకటించారు. జాతీయ పార్టీలతోపాటు ప్రాంతీ య పార్టీలు బీసీ వాదాన్ని ఎత్తుకోవడం మెజారిటీ ప్రజలైన బీసీల చుట్టే రాజకీయ సమీకరణాలు తిరగడం, భవిష్యత్ రాజకీయాలలో గుణాత్మాకమైన మా ర్పు బీసీ వాదం సృష్టించబోతుందనేది రాజకీయ వ్యూహకర్తల అభిప్రాయం.

నామమాత్రపు చర్యలతో ఒరిగేదేమీ ఉండదు

నూతనంగా ఏర్పాటు చేయనున్న ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండూ మ్ టెక్నాలజీ’ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం, కోఠిలోని మహి ళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం వంటి తాత్కాలిక, నామమాత్రపు చర్యలను ప్రభుత్వ దిద్దుబాటు చర్యలుగా పరిగణించవచ్చు. బీసీ ఉద్యమాన్ని కొంతమేర ఈ చర్యలు నిరోధిస్తాయనే అపోహలో అధికార పార్టీ ఉండవచ్చు.

కానీ, నేడు బీసీల ఉద్యమం ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందుతున్నది. ఈ తీరు గురించి ముఖ్యంగా సోషల్, ఇతర మీడియాలో కుల జనగణనపై వచ్చే కథనాలు అన్నీ బీసీలకు జరుగుతున్న అన్యాయల గురించి వివరిస్తున్నాయి. ప్రతి పల్లెలో ప్రజలమధ్య కుల జనగణనపై చర్చ జరుగుతున్నది. ప్రత్యేకంగా లోపభూయిష్టమైన ‘ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్స్’ (ఈడబ్లుఎస్) వల్ల బీసీలకు జరిగే నష్టం బీసీ విద్యార్థి, నిరుద్యోగ యువతలో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తుంది.

బీసీల అవకాశాలను అన్ని రంగాల్లో గత 75 సంవత్సరాలుగా కొల్లగొడుతున్న అగ్ర, ఆధిపత్య వర్గాల మైండ్‌సెట్‌ను, వారి కుట్రలను బీసీ సమాజం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకొంటూ, అడ్డుకునే దిశగా ఆలోచనలు చేస్తుంది. ఆధిపత్య వర్గాలు బీసీ సమాజానికి చేసిన, చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతూ కొత్త తరం బీసీల నాయకత్వం బీసీ రాజ్యాధికారమే తమ సకల సమస్యలకు పరిష్కారమనే దిశగా అడుగులు వేస్తూ, రాజకీయ చైతన్యంతో ముందుకు దూసుకెళ్తున్నారు. 

గ్రామగ్రామన బీసీ స్లీపర్ సెల్స్‌ను క్రి యాశీలం చేయడానికి దోహదం చేస్తున్నాయి. నేడు గ్రామాలలో సమగ్ర కుల జనగణన గురించి చర్చలు జరుగడం బీ సీ ఉద్యమానికి ఒక తొలిమెట్టుగా భావించాలి. గ్రామాలలో ఎవరి జనాభా ఎంత అనే లెక్కల అంచనాకు గ్రామ రాజకీయ వ్యూహకర్తలు వస్తున్నారు. తద్వార గ్రామాలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ముఖ్యంగా జనరల్ స్థానాలలో గెలుపు ఓటమిలను నిర్ణయించడం లో సామాజిక సమీకరణలు క్రియా శీలకంగా మారనున్నాయి.

- చెన్న శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు,

సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా

సెల్: 7036988999