25-11-2025 12:00:00 AM
మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, నవంబర్ 24 (విజయక్రాంతి) : ప్రభుత్వ కళాశాలల్లోనే గుణాత్మకమైన విద్య అందుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజ్ లో ప్రీతం జోనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న వందమంది నిరుపేద విద్యార్థులకు ఏకరూప దుస్తులను, ఎగ్జామ్ ప్యాడ్ లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ కాలేజ్ లోని పేద విద్యార్థులకు యూనిఫామ్ లను, ఎగ్జామ్ ప్యాడ్‌లను బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ప్రీతం జోనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గండూరి ప్రకాష్ అందజేయడం పట్ల అభినంద నలు తెలియజేశారు. ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులే మానసికంగా ధైర్యంగా ఉంటారని ప్రైవేటు కాలేజీలో ర్యాంకులు తప్ప వారికి సామాజిక చైతన్యం ఉండదన్నారు.
ఒత్తిడితో విద్య రాదు అని ప్రశాంతమైన వాతావరణంలోనే విద్య వస్తుందన్నారు. జూనియర్ కాలేజీ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ యాదయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మాజీ కౌన్సిలర్ తహేర్ పాషా,వల్దాస్ జానీ, చక్రహరి నాగరాజు, మోత్కూరి సందీప్, రాచకొండ కృష్ణ, రాంమ్మూర్తి గౌడ్, కళాశాల డిఐఈఓ బాను నాయక్, అధ్యాపకులు వాసు, ప్రసాద్, బషీరున్నిషా, సైదులు, గురువయ్య, నవీన్, చీకూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.