05-01-2026 01:01:51 AM
భూమిపూజ చేసిన ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్/తలమడుగు, జనవరి 4 (విజయక్రాంతి): ఆదిలాబాద్ ప్రజలు ఎన్నో ఏళ్లు గా ఎదురుచూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేస్తామని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం తాంసి బస్టాండ్ వద్ద పూర్తిగా కేంద్రం నిధులు రూ. 107 కోట్లు తో చేపట్టే రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యేలు భూమిపూజ చేసా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గతంలో పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రభు త్వం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిర్మించ తలపెట్టిన రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పనులు అర్థాంతంగా ఆగిపోయాయని అన్నారు.
ప్రస్తుతం కేంద్రం పూర్తిస్థాయి నిధులతో ఈ పనులను చేపడ్డటం జరుగుతోందన్నారు. ఎన్నో ఏళ్లుగా మూతపడిన సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కృషి చేస్తే, తాను ఫ్యాక్టరీ నీ అమ్ముకుంటున్నారని బీఆర్‌ఎస్ వారు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. బ్రిడ్జి నిర్మాణానికి బాధితులకు నష్టపరిహారం విషయంలో తను అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, మున్సిపల్ కమి షనర్ రాజు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
వంతెన నిర్మాణం చేపట్టాలని
దేవాపూర్ రైతుల వినతి
తలమడుగు మండలం దేవాపూర్ రైతులు ఆదివారం ఎంపీ గోడం నగేష్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దేవాపూర్ గ్రామం నుండి కమలాపుర్ వెళ్లే మార్గంలో వంతెన లేకపోవడం వలనవర్షాకాలంలో చేనులోకి ఏరువులు, రైతులు ఎడ్లబం డి కుడా వెళ్లలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. దేవాపూర్, కమలాపూర్ గ్రామాల మధ్య వంతెన నిర్మాణం చేపట్టాలని ఎంపీకి విన్నవించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్, బీజేవైఎం మండల అధ్యక్షులు కిరణ్, రఘు, శ్రీనివాస్, ఎంబడి సంతోష్, మోహన్, రవి, పోశెట్టి, సంతోష్ పాల్గొన్నారు.