05-01-2026 01:00:26 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 4(విజయక్రాంతి): 10వ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలె క్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి రికార్డులు, విద్యా బోధన తీరు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచాలని తెలిపారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించి, మెనూ ప్రకారం పౌష్టిక ఆహా రం, శుద్ధమైన త్రాగునీటిని అందించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందని తెలిపారు.
నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు విద్యాబోధన అందించి వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో ప్రత్యేక తరగతులు నిర్వహించి వెనుకబడిన విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించి విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఉపాధ్యాయులు విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. అనంతరం విద్యా ర్థులకు స్వయంగా పాఠ్యాంశాలు బోధించి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరీక్షించారు.