calender_icon.png 8 January, 2026 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం పర్యటనను అడ్డుకుంటాం

05-01-2026 01:03:02 AM

రైతుల పక్షాన చేపట్టే బంద్‌ను విజయవంతం చేయాలి

మాజీ మంత్రి జోగు రామన్న పిలుపు

ఆదిలాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): రంగు మారిన సోయా కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు వేస్తే సీఎం పర్యటనను  అడ్డుకుంటామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అద్యక్షుడు జోగు రామన్న వెల్లడించారు. సోయా రైతుల పక్షాన ఈనెల 6న చేపట్టే ఆదిలాబాద్ బంద్ లో అన్ని వర్గాలవారు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ... అదిలాబాద్ సంపూర్ణ బంద్ కు  మద్దతు లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యలు కావాలని కోరారు. సోయాబీన్ కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో, వారి మానసిక స్థితిగతులతో ఆటలాడుకుంటుందన్నారు.

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి తరుణంలో బీఆర్‌ఎస్ పార్టీ రైతులకు ధైర్యాన్ని కల్పిస్తూ వారికి అండగా నిలుస్తామన్నారు. రైతులకు పూర్తి న్యాయం జరిగేంత వరకు ఆందోళన కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టే ఆదిలాబాద్ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక, కర్షక, ఆర్టీసీ, చిరు వ్యాపారులు ప్రతి ఒక్కరూ రైతులకు అండగా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనాలని   జోగు రామన్న కోరారు. ఈ సమావేశంలో నాయకులు మెట్టు ప్రలాద్, సాజీడోద్దీన్, గండ్రత్ రమేష్, అశోక్ స్వామి, యూనుస్ అక్బనీ, సేవ్వా జగదీష్, ధమ్మా పాల్, సంతోష్, బట్టు సతీష్, అన్నెలా వసంత్ పాల్గొన్నారు.