20-05-2025 02:19:40 AM
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో 4 రోజు లపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ద్రోణి, ఉపరితల ఆవ ర్తనం ప్రభావంతో రాష్ర్టంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నట్టు వెల్ల డించింది. 4 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతోపాటు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆ యా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీచేసింది. వర్షాల ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముంది. నైరు తి రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో జూన్ తొలి వారంలోనే రాష్ర్టంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.