calender_icon.png 24 August, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

24-08-2025 01:39:38 AM

  1. త్వరలోనే వివరణ ఇవ్వాలని కోరిన సభాపతి
  2. ఒక్కో ఎమ్మెల్యేకు రెండు రోజుల వ్యవధి 

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులిచ్చారు. శనివారం ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వగా, అంతకుముందు రోజు కూడా ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. న్యాయనిపుణులతో చర్చించాకే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చినట్టు తెలిసింది.

స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కం ఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఒక్కో తేదీ ఇచ్చి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. ఒక ఎమ్మెల్యేకు.. మరో ఎమ్మెల్యేకు మధ్య రెండు రోజుల విరామంతో విచారణకు వ చ్చేలా నోటీసులిచ్చినట్టు సమాచారం.

స్పీక ర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్‌ఎస్ గూటికి చేరుతారా? లేక రాజీనామా చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ గతంలోనే స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గద్వా ల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, భద్రాచలం తెల్లం వెంకట్‌రావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేందర్‌నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్‌లో చేరారు.