02-11-2025 07:01:55 PM
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి వర్షం బీభత్సంగా కురుస్తోంది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, మధురానగర్, కృష్ణానగర్, రహమత్ నగర్, యూసుఫ్ గూడ, ఎల్లారెడ్డిగూడ, ఎర్రగడ్డ, పంజాగుట్ట, బంజారాహిల్స్, కూకట్ పల్లి, హైదర్ నగర్, జేఎన్టీయూ, మూసాపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి, కేపీహెచ్బీ, ఆల్వీన్ కాలనీ, గచ్చిబౌలిలో వాన పడుతోంది.
అలాగే ఖాజాగూడ, మెహదీపట్నం, టోలిచౌకి, మణికొండ, రాయదుర్గం, పంజాగుట్ట, పటాన్ చెరు, మియాపూర్, అంబర్ పేట్, కాచిగూడ, నల్లకుంట, బర్కత్ పురా, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట, బీఎన్ రెడ్డినగర్, బాలానగర్, బడంగ్ పేట్, మన్సూరాబాద్, నాగోల్, అబ్దుల్లాపూర్ మెట్, మలక్ పేట్, సైదాబాద్, సరూర్ నగర్, చంపాపేట్, సంతోష్ నగర్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, మహేశ్వరం, తుక్కుగూడ, పహాడీషరీఫ్, సికింద్రాబాద్ పరిధిలోని ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, గాంధీనగర్, జవహర్ నగర్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, దోమల్ గూడ, కవాడిగూడ, భోలక్ పూర్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కురవడంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరి ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.