calender_icon.png 10 January, 2026 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణితంలో పీహెచ్‌డీ సాధించిన రాజ్ కుమార్

10-01-2026 12:09:03 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): మ్యాథ మేటిక్స్ విభాగంలో పీహెచ్డీ పట్టా పొందిన  వ్యక్తిగా జెండగూడ గ్రామానికి చెందిన మసాదే రాజ్కుమార్ గుర్తింపు పొందారు. హైదరాబాద్ హిమాయత్నగర్లోని చైతన్య డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో స్టెబిలిటీ అనాలిసిస్ ఆఫ్ మల్టీ-స్పీసీస్ ఎకలాజికల్ మోడ ల్స్ అనే పరిశోధన సిద్ధాంతంపై ఆయన పీహెచ్డీ సాధించారు.

ఈ పరిశోధన డాక్టర్ ఆచార్య బి. హరి ప్రసాద్ పర్యవేక్షణలో జరిగింది. పీహెచ్డీ పట్టాను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య ఎం. రవీందర్ ప్రదానం చేయగా, ఛాన్సలర్ డాక్టర్ సి.హెచ్. వి. పురుషోత్తం రెడ్డి తదితరులు అభినందించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశా లలో మ్యాథమేటిక్స్ లెక్చరర్గా పనిచేస్తూ పీహెచ్డీ సాధించడం అభినందనీయం.