calender_icon.png 10 January, 2026 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

10-01-2026 12:06:47 AM

జైనూర్, జనవరి 9 (విజయక్రాంతి): మండలంలోని మార్లవాయిలో గిరిజనుల ఆరాధ్యులు హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ స్మారక క్రీడా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కబడ్డీ, వాలీబాల్ పోటీలను సర్పంచ్ కనక ప్రతిభతో కలిసి  సీఐ రమేష్, ఎస్త్స్ర రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  క్రీడల్లో స్నేహ పూర్వకత, క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని సూచించారు.

మారుమూల గిరిజన ప్రాంతాల క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రామచందర్, పిడి చొక్కారావు పాల్గొన్నారు.