20-08-2025 07:35:54 PM
పెద్ద కొడఫ్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో బుధవారం భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశ ఆరవ ప్రధానమంత్రిగా 1984 అక్టోబర్ 31 తల్లి ఇందిరాగాంధీ మరణంతో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 1989 డిసెంబర్ 2న సాధారణ ఎన్నికల్లో పరాజయం పొంది రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశారని 40 సంవత్సరాల వయసులో ప్రధాన మంత్రి అయినా రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి పదవి నిర్వహించిన వారిలో అతిపిన్న వయస్కుడు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకున్నారు. ఆయన భారత దేశానికి అందించిన సేవలను కొనియాడుతూ, దేశాన్ని టెక్నాలజీ పరంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడిగా గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు