15-08-2025 12:26:22 AM
గజ్వేల్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
గజ్వేల్, ఆగస్టు 14: భారత జాతి ఐక్యత కోసమే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జిల్లా, మండల కేంద్రాల్లో ప్రధాని మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్నట్లు బిజెపి పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు. బిజెపి పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ లో ఇందిరా పార్క్ చౌరస్తా నుండి పట్టణ ప్రధాన రహదారిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ విలేకరులతో మాట్లాడారు. భారత దేశ ఔన్నత్యాన్ని దేశ విదేశాలు గుర్తించేలా మోడీ పాలన కొనసాగుతుందన్నారు. ప్రజల్లో దేశభక్తి, దైవభక్తిని పెంపొందిస్తూ అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న ప్రధాని మోడీ జాతీయ ఐక్యతకు కంకణం కట్టుకున్నారన్నారు.
దేశ రక్షణ ప్రజల రక్షణ కోసం ఆపరేషన్ సింధూర్ లాంటి దాడులు ఎన్నైనా చేయడానికి సైన్యానికి ప్రధాని మోడీ అండగా నిలబడ్డారన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రధాని మోడీకి దేశ ప్రజలంతా మద్దతుగా నిలిచి మరోసారి జాతి ఐక్యతను ప్రపంచానికి తెలియజేశా రన్నారు.
కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఎల్లురామిరెడ్డి, నందన్ గౌడ్, బండారు మహేష్, జస్వంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, మండల అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్, సీనియర్ నాయకులు ఉప్పల మధు, నాయకులు మల్లం సుమతి, నాయని సందీప్, బార్ అరవింద్, కాశమైన సందీప్, లక్ష్మణ్, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.