calender_icon.png 27 January, 2026 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవా పురస్కారం అందుకున్న రామకృష్ణ

27-01-2026 12:00:00 AM

హుజూర్ నగర్, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన హెల్త్ అసిస్టెంట్ ఇందిరాల రామకృష్ణ అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చేతులమీదుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని సోమవారం అందుకున్నారు.ఈ సందర్భంగా హుజూర్ నగర్ మండల వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ నాయక్ మాట్లాడుతూ...

జాతీయ ఆరోగ్య కేంద్రాల అమలులోను డెంగ్యూ, టీబి,లెప్రసీ మరియు పాఠశాల ఆరోగ్య విద్య కార్యక్రమాల్లోను రామకృష్ణ సేవలు అందించారన్నారు.ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న రామకృష్ణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, పలువురు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పద్మ,పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ నూర్జహాన్ బేగం,ఆరోగ్య కేంద్ర సిబ్బంది,ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.