calender_icon.png 12 August, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు రాంచందర్‌రావు వ్యవహారం

12-08-2025 01:00:36 AM

- రాష్ట్ర అధ్యక్ష పదవి రావడంతో కొత్త మురిపంలో ఉన్నాడు 

- రాహుల్‌గాంధీపై వ్యాఖ్యలుసరికావు: విప్ ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కొత్త మురిపంలో ఉన్నాడని, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ఆయన వ్యవహార శైలి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. పార్టీ అధ్యక్ష పదవి వచ్చిందన్న ఆనందంలో రామచందర్‌రావు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆయన ఆరోపిం చారు. సోమవారం ఆది శ్రీనివాస్ సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడు తూ.. రాహుల్‌గాంధీ నకిలీ ఇండియన్ అని రామంచందర్‌రావు వ్యాఖ్యానించడం సరికాదన్నారు.

బీజేపీ నాయకులది నకిలీ జాతీయ వాదమని, పైకి మాత్రమే జాతీయవాదం చూపిస్తూ లోపలంతా మతతత్వమేనన్నారు. అధికారం కోసమే జాతీయతను రెచ్చగొడుతున్నారని విమ ర్శించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర రాహుల్‌గాంధీ కుటుంబానిదని, బీజేపీ నేతలెవరైనా దేశం కోసం ప్రాణాలు ఇచ్చారా? అని ఆయన నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు.

గత ఎన్నికల్లో 420 ఎంపీ సీట్లు గెలుస్తామని చివరకు 240 సీట్లకే పరిమితమయ్యారని, కేంద్రంలో బీజేపీ పని అయిపోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలోనూ బీజేపీని ఎవరూ పట్టించుకొనే పరిస్థితి లేదని ఆది శ్రీనివాస్ విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దెబ్బకు ఏం చేయాలో బీజేపీ నేతలకు పాలుపోవడం లేదని, నకిలీ ఓట్లపైన రాహుల్‌ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారన్నా రు.