27-01-2026 01:35:38 AM
వరంగల్, జనవరి 26: బీజేపీ వరంగల్ జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జిగా రతన్ నో ముల సోమవారం బాధ్యతలు చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అధ్యక్షతన, రాష్ట్ర, జిల్లా నాయకుల సమక్షం లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలు, కా ర్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోష ల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం రతన్ నోముల గారికి ఉందని తెలిపారు.రతన్ నోముల మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత ను అప్పగించిన పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి, బీజేపీ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజ ల్లోకి బలంగా తీసుకెళ్తానని పేర్కొన్నారు. ప్ర ధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతానికి, వికసిత భారత్ సంకల్ప సాధనకు కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు. పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.