calender_icon.png 4 August, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ రేషన్ కార్డుల మంజురు

31-07-2025 01:27:49 AM

ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ 

వారసిగూడ జూలై 30 (విజయక్రాంతి) : సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు.

సికింద్రాబాద్ తొమ్మిదో రేషన్ సర్కిల్ పౌర సరఫరాల అధికారి శ్రీమతి చాముండేశ్వరి నేతృత్వంలోని పౌర  సరఫరాల అధికారుల బృందం బుధవారం సితాఫలమండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో పద్మారావు గౌడ్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ పౌర సరఫరాల విభాగం కార్యకలాపాలను సమీక్షించా రు. కొత్త కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని, అర్హులకు కార్డులు జారీ చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు.