calender_icon.png 19 November, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జయకృష్ణకు జోడీగా రవీనాటాండన్ కుమార్తె!

18-11-2025 12:06:13 AM

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు, జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా అరంగేట్రం చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తుండగా ‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించనున్నారు. ‘చందమామ కథలు’ బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తు-న్నారు.

కొన్నిరోజుల క్రితం ఈ చిత్రాన్ని ఎనౌన్స్ చేయగా..  జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ అగ్రనటి రవీనా టాండన్, ప్రముఖ నార్త్ ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ థడానీల కుమార్తె.. రాషా టాండానీ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ మేరకు సోమవారం దర్శకుడు అజయ్ భూపతి రాషా టాండానీ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేస్తూ ఆమె టాలీవుడ్ ఎంట్రీని ధ్రువీకరించారు.

దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచే సింది. అద్భుతమైన కొండల మధ్య సాగే సినిమా మనసుకు హ త్తుకునే ప్రేమకథ ప్ర ధానంగా ఉంటుంది. భావో ద్వేగాలు, నిజాయితీ, రి యలిజం కలగలిపిన ఈ సినిమా కొత్త తరహా ప్రే మకథగా ఉండబోతుం ది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారం భం కానుంది. టైటిల్‌తోపాటు మరిన్ని ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో నే అధి-కారికంగా వెల్లడించనున్నారు.