30-06-2024 05:30:06 PM
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆదివారం అదే బాట పట్టారు. టీ20 క్రికెట్ కు రవీంద్ర జడేజా గుడ్ బై చెప్పాడు. భారత్ శనివారం జరిగిన ఐసీసీ పురుషుల టీ-20 ప్రపంచ కప్ 2024లో దక్షిణాఫ్రికాను ఫైనల్‌లో ఓడించి కప్పు కొట్టింది. నిన్ననే అంతర్జాతీయ టీ20 లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ''అత్యుత్తమమైన ఆటను దేశానికి అందించాను. టీ20 ఫార్మాట్లకు మాత్రమే గుడ్‌బై చెప్పా. ఇతర ఫార్మాట్లలో నా ఆటను కొనసాగిస్తా, అంతార్జాతీయ క్రికెట్ గెలవడంతో నా కల నెరవేరింది'' అని జడేజా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆల్ రౌండర్ జడేజా 74 అంతర్జాతీయ టీ-20 మ్యాచులు ఆడి 515 పరుగులు చేశాడు. తన టీ-20 కెరీర్ లో 54 వికెట్లు తీశాడు.