23-10-2025 01:41:59 AM
కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం ను తనిఖీ చేసిన కలెక్టర్
దేవరకద్ర, అక్టోబర్ 22: మండలం కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం ను బుధవారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలో ఆవరణను పరిశీలించి. పాఠశాల ఆవరణం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపాలని పంచాయతీ రాజ్ ఈ ఈ ని ఆదేశించారు. 10 వ తరగతి గదికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడారు మెనూ,ఆహార నాణ్యత ఎలా ఉంది? విద్యార్థులని అడిగి తెలుసుకున్నారు.
గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి వార్షిక పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత శాతం సాధించాలని అన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.మెనూ పాటించక నాణ్యమైన భోజనం అందించక నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.కలెక్టర్ వెంట స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.