09-10-2025 12:34:33 AM
- 5ఎంపీటీసీ స్థానాలకు, ఒక జెడ్పీటీసీకి సీపీఎం పోటీ
- పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా
అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 8: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం పార్టీ పోటీ చేస్తుందని.. కార్యకర్తలందరూ సిద్దంగా ఉండాలని సీపీఎం అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా అన్నారు. సీపీఎం అబ్దుల్లాపూర్‌మెట్ మండల కమిటీ సమావేశం బుధవారం ప్రజా సంఘాల ఆఫీసులో నిర్వహించారు. అనంతరం ఏర్పుల నర్సింహా మాట్లాడుతూ.. సీపీఎం పార్టీ ప్రజా పోరాటాల్లో ముందంజలో ఉందన్నారు.
స్థానిక సంస్థ ఎన్నికల్లో బూర్జువా పార్టీలను గెలిపించుకుని మోసపోవద్దని.. ప్రజ సమస్యలపై పోరాడే కమ్యూనిస్టులను గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు. సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడే సీపీఎం పార్టీ నాయకులు ఉంటారని గుర్తుచేశారు. అలాంటి నాయకులను ప్రజాప్రతినిధులు గెలించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. మండల పరిధిలో 5 ఎంపీటీసీ స్థానాలకు, ఒక జెడ్పీటీసీకి పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గుండె శివకుమార్, ముత్యాల శ్రీశైలం, బిక్షపతి,ఆలేటి, శ్రీనివాస్, శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.