11-09-2025 12:24:41 AM
టేకులపల్లి, సెప్టెంబర్ 10,(విజయక్రాంతి):టేకులపల్లి నుంచి ముత్యాలంపాడు వెళ్లే రహదారిలోని స్మశాన వాటిక సమీపంలో బీటీ రోడ్డు బుధవారం నాడు మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి రోడ్డు కింద బుంగ బడి నీటి ప్రవాహానికి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో టేకులపల్లి ము త్యాలంపాడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఉన్నతాధికారులు గ్రామపం చాయతీ అధికారులు తక్షణమే చర్యలు చేప ట్టి రోడ్డు మరమ్మతులు చేపడితే ఆ మార్గం నుండి రాకపోకలు జరుగుతాయని ఈ ప్రాంత రైతులు, వాహనదారులు కోరుతున్నారు. ముఖ్యంగా ఈ రహదారి గుండా టేకులపల్లి నుంచి ముత్యాలంపాడు, కొత్త తండా, తూర్పు గూడెం, పాతతండా, రాం పురం తండా, హరిజనవాడ, మాలపల్లి, తూ ర్పు గూడెం మీదుగా సుజాతనగర్ గ్రామాలకు ఈ రహదారి ముఖ్యమైనది దీనిని దృ ష్టిలో పెట్టుకొని అధికారులు స్పందించి వెంటనే కోతకు గురైన రోడ్డుకు మరమ్మతు లు చేపట్టి వాహనదారులకు రైతులకు రాకపోకలు జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.