27-04-2025 12:00:00 AM
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలైనప్పటికీ దేశ జనాభాలో దాదాపు 50 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారంలో తగిన వాటా దక్కడం లేదు. బీసీలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక, న్యాయాలు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. ప్రజాస్వా మ్య, గణతంత్ర రాజ్యంలో సంక్షేమం పేరుతో వెనుకబడిన వర్గాల వారికి ప్రకటించిన పథకాలు ప్రజల జీవన స్థితిగతు లను మార్చలేదు. రాజకీయ నేతలు మభ్యపెట్టే వాగ్దానాలతో బీసీలను ఓటుబ్యాంకు గానే వాడుకుంటున్నారు. రాజకీయ పార్టీ ల మాటలు నీటిమూటలు. ఎన్నికల సమయంలో బీసీ సాధికారత కోసం కృషి చేస్తామని అన్ని పార్టీలు తమ మేనిఫెస్టో ల్లో చెబుతున్నాయి. కానీ, అధికారం లోకి వచ్చిన తర్వాత హామీలను గాలి కొదిలేస్తున్నాయి.
గెలుపు గుర్రాల పేరుతో జాతీయ పార్టీలు మొదలుకొని ప్రాంతీయ పార్టీల వరకు ధన వంతులు, పెట్టుబడిదారులు, వ్యాపారస్తు లు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, నేరచరితులకు పోటీపడి మరీ టిక్కె ట్లు ఇస్తున్నాయి. రాజకీయాలను కార్పొరేట్ శక్తులు తమ కనుసన్నల్లో శాసిస్తున్నా యి. ఈ ధోరణి ఇలానే కొనసాగితే ప్రజాస్వామ్య వ్యవస్థ పతనమయ్యే ప్రమాద ముందని రాజనీతి వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో విజయానికి ధనమే గీటురాయిగా మారింది. అందువల్ల బీసీ వర్గాలకు చెందిన పేదప్రజలు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు రాలేక పోతున్నారు. దేశ జనాభాలో చాలా తక్కువ మొత్తంలో ఉన్న అగ్రకులాల వారు చట్టసభల్లోకి ప్రవేశించి రాజ్యాధికారాన్ని చెలాయిస్తున్నారు. ఈ క్రమంలో కులాల దామాషా ప్రకారం హక్కులు లభించడమే ప్రజాస్వామిక న్యాయమన్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ మాటలతో పాలకులకు కనువిప్పు కలగాలి.
సిఫార్సులను అమలు చేయాలి
దేశంలో అన్ని కులాల వారికి జనాభా నిష్పత్తి ప్రకారం ప్రభుత్వాల్లో ప్రాతినిధ్య వాటా కల్పించాలి. స్వేచ్ఛ, సమానత్వం, అవకాశాలు అందరికీ సమానంగా లభించినప్పుడే సమగ్రాభివృద్ధి జరిగినట్టు లెక్క. జనాభా గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభు త్వం దేశంలో బీసీలకు రాజ్యాంగబద్ధమైన రాజకీయ హక్కులు, భద్రత కల్పించాలి. ఇ టీవల వెల్లడైన కొన్ని గణాంకాల ప్రకారం రాజకీయ రంగంలో బీసీల ప్రాతినిధ్యం కే వలం 14 శాతం మాత్రమే అని వెల్లడైంది. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు కొన్ని దశాబ్దాల కాలం నాటి జనాభా లెక్కల ప్రకారమే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. పదేళ్ల కోసారి జరిగే జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీల జనాభాను మాత్రమే లెక్కిస్తున్నారు. బీసీ జనాభా లెక్క తేల్చకపోవడం సరికాదు.
స్వాతంత్య్ర పూ ర్వం నుంచి ఇప్పటి వరకు అనేక కమిషన్లు బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వాలకు సిఫార్సులు చేశాయి. కానీ, అవేవీ అమలుకు నోచుకోలేదు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులపై ఆధారపడి ఉంది. రాజకీయాల్లో బీసీల ప్రాతినిధ్యం 14 శాతానికి మించి లేకపోవడం వల్ల బీసీ ప్రజల అభివృద్ధి చెప్పుకో దగిన స్థాయిలో లేదు. కేవలం రాజకీయాల్లోనే కాకుండా ఉద్యోగాల్లో కూడా వెనుక బడిన తరగతుల వారికి అన్యాయమే జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారు. కానీ, దేశంలో జనాభా లో సగభాగం ఉన్న బీసీలకు మాత్రం రిజర్వేషన్లను అమలు చేయ కుండా అణచి వేశారు. వారిని కొందరు కేవలం ఓట్లకోసం వాడుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలి.
రిజర్వేషన్లపట్ల చిత్తశుద్ధి ఉండాలి
రిజర్వేషన్ల ద్వారానే బీసీల హక్కులకు రక్షణ లభిస్తుంది. సమగ్రాభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. అందువల్ల బహుజన నాయకులు బీసీల సాధికారిత కోసం పో రాడాలి. దేశ ప్రజల కోసం ఆహారోత్పత్తి చేస్తూ నాగరిక సమాజ అవసరాలు తీర్చే కులవృత్తుల వాళ్లలో అత్యధిక శాతం బీసీలే ఉన్నారు. ఈ కులాల సమస్యలకు పరిష్కారం లభించాలంటే చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు అమలు కావాలి. దేశంలోని పలు రంగాల వారీగా బీసీల వాట గమనిస్తే, ప్రభుత్వ ఉద్యోగాల్లో 9 శాతం, పారిశ్రామిక రంగంలో 1 శాతం, ప్రైవేట్ ఉద్యోగాల్లో 5 శాతం ఉన్నారు. బీసీల జనాభాను లెక్కించడం ద్వారా నిష్పత్తి ప్రకారం బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరిగితే, ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలవుతాయి.
వెనుకబడిన తరగతులకు చెంది న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో న్యాయమైన ప్రాతినిధ్యం లభిస్తుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు అంతరిస్తాయి. ఆత్మగౌరవం ఇనుమడిస్తుంది. ప్రపంచంలోని అనేక దేశాలు పీడిత ప్రజల సమగ్ర వికాసానికి కృషి చేస్తుంటే మన దేశంలోని పాలకులు మాత్రం ఈ వర్గాలను మరింత దోచుకుంటూ రాజ్యాధికారంలో సమాన వాటా కూడా ఇవ్వకుం డా నిర్లక్ష్యం చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం బీసీలు సా మాజిక, ఆర్థిక, రాజ కీయ, విద్య, వైద్యం, శాస్త్ర సాంకేతిక, వ్యాపార, వాణిజ్య రంగా ల్లో సాధించిన పురోగతి మీద, అలాగే వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద, అభివృధి సంక్షే మం కోసం అమలైన చట్టాల ఫలితాలపై సామాజిక, ఆర్థిక, న్యాయ నిపుణులతో అధ్యయన కమిటీ వేసి సమగ్ర అధ్యయ నం జరిపించాలి.
బీసీ సామాజిక వర్గానికి చెందిన నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దీర్ఘకాలంగా పరిష్కా రానికి నోచుకోని కొన్ని సమస్యలను పరిష్కరించారు. ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వా స్’ అనే నినాదంతో పాలనలో దూసుకెళ్తున్న ప్రధాని మోదీ బీసీ జనగణన చేపట్టి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లను అమ లు చేయడంతోపాటు బీసీ సబ్‌ప్లాన్‌ను రూపొందించి సరికొత్త చరిత్రను సృష్టించాలి. కేంద్రమంత్రి వర్గంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చెయ్యాలి. ఎస్సీ కమిషన్ తరహాలో బీసీ కమిషన్‌ను స్థాపించాలి. దానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించి, బీసీల సాధికారతకు తోడ్పడాలి.
ఆదర్శరాష్ట్రంగా తెలంగాణ
రాజకీయ పార్టీలు బీసీలను ఓటుబ్యాంకుగా వాడుకునే సంస్కృతిని వీడాలి. చట్ట సభలకు సీట్ల కేటాయింపులో బీసీలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వాలి. పార్టీకి సం బంధించిన జిల్లా, రాష్ట్ర స్థాయి అధ్యక్ష పదవుల్లో వారికి సరైన అవకాశం కల్పించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులకు అధిక ప్రాముఖ్యం ఇస్తున్నది. ఇదే తరహాలో రాబోయే ఎన్నికల్లో బీసీలకు అధిక టిక్కెట్లు కేటాయించి దేశానికే ఆదర్శంగా నిలవాలి. ఓటు వేసే స్థాయినుండి శాసనాలు చేసే స్థాయికి బీసీలు ఎదగాలి. పార్లమెంట్‌తోపాటు రాష్ట్రాల చట్టసభల్లో బీసీలకు సింహభాగం సీట్లను రిజర్వ్ చేస్తూ చట్టాలను రూపొందించాలి. ఇప్పటి వరకు చట్టసభల్లోకి ప్రవేశించని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.
రా జ్యాం గంపై బీసీలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేకంగా శిక్షణ తరగ తుల ను ఏర్పాటు చేయాలి. జనాభా ఆధారంగా బడ్జెట్‌లో భారీ స్థాయిలో నిధులు కేటాయించాలి. కేవలం ఓటుబ్యాంకుగానే కా కుండా బీసీల పురోగతికి ప్రభుత్వం సమగ్రమైన పాలసీని రూపొందించాలి. ఇలాంటి వన్నీ చేయడం ద్వారా వెనుకబడిన వర్గాల ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నిం పాలి. ఐక్యత, చైతన్య ఉద్యమాలు, రాజ్యాధికారంతోనే బీసీల సమ గ్రాభివృద్ధి జరుగు తుంది. బీసీ ప్రజలు సామాజికంగా, రాజకీయంగా ఒక్కటి కావాల్సిన అవసరం ఎంతై నా ఉంది. ఐక్య ఉద్యమాల్లో బీసీకి చెందిన ప్రతి వ్యక్తి క్రియాశీలకంగా పాల్గొనాలి. దేశంలో జరిగిన చాలా ఉద్యమాల్లో పాల్గొ న్న బీసీ ప్రజలు తమ జాతి ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం కలిసికట్టుగా ఉద్యమించాల్సి న సమయం ఆసన్నమైంది.
వ్యాసకర్త ; నేదునూరి కనకయ్య,సెల్: 9440245771