calender_icon.png 5 May, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ విద్యపైనే ఎంతో భవిష్యత్తు

27-04-2025 12:00:00 AM

రాష్ట్రంలో ఇంటర్ విద్యాభివృద్ధికి ప్రభుత్వాలు మరింత శ్రద్ధాసక్తులు కనబరచవలసిన అవసరం చాలా కనిపిస్తున్నది. ‘టెన్ ప్లస్ త్రీ’ విధానంలో స్కూలు విద్యకు, ఉన్నత విద్యకు ఒక వారధివలె పనిచేసే ఈ కాలేజీలలో మౌలిక వసతుల కల్పనపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా ఇటీవలి పరీక్షా ఫలితాలు, ఆయా కళాశాలల పనితనాలను పేర్కొనవచ్చు. 

కొఠారి కమిషన్ (1964-66) సిఫార్సులను అనుసరించి ఉన్నత విద్య దేశమం తటా ఒకే రీతిలో ఉండేలా నూతన విద్యా పథకం 10 + 2 + 3 (10 సంవత్సరాలు పాఠశాల విద్య, 2 సంవత్సరాలు ఇంటర్ విద్య/ ప్రీడిగ్రీ విద్య, 3 సంవత్సరాలు డిగ్రీ విద్య) అమలులోకి వచ్చింది. దీనిని గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు పరిచింది. 1969 విద్యా సంవత్సరం నుండి 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సును కొన్ని డిగ్రీ కళాశా లల లోనూ, మరికొన్నింటిని ప్రభుత్వ జూనియర్ కళాశాలలలోనూ, ఇంకొన్ని అభి వృద్ధి చేయబడిన బహుళార్థ పాఠశాలల (మల్టీపర్పస్ స్కూళ్లు)లోనూ ప్రవేశపెట్టారు.

నేడు తెలంగాణలో ఇంటర్మీడియ ట్ కోర్సులను వివిధ గురుకుల సంస్థల్లో, ఆదర్శ పాఠశాలల్లో, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో అందిస్తున్నది. ఇ టు ఉన్నత పాఠశాలలకు, అటు డిగ్రీ కళాశాలలకు ఈ ఇంటర్మీడియట్ విద్య వార ధిగా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. 1970లో ఇంటర్మీడియట్ విద్యను విశ్వవిద్యాలయ పరిధినుంచి తప్పించి ప్రభుత్వ చట్టప్రకారం ఇంటర్మీడియట్ విద్యా మం డలి, ఇంటర్మీడియట్ బోర్డును 1971లో నెలకొల్పారు. ఈ మండలికి స్టాట్యుటరీ బాడీ అధికారాన్ని ఇచ్చారు. ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ప్రీయూనివర్సిటీ కోర్సుగా ఉన్న దీనిని 1969 నుండి ఇంటర్మీడియట్ విద్యగా మార్చారు.

సంస్కరణల ఫలితాలు

గత రెండు సంవత్సరాల కంటే ఈ సంవత్సరంలో (2024- 25) ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో ద్వితీయ సంవత్సరపు ఉత్తీర్ణత శాతం కొంతమేరకు పెరిగి నట్లుగా చెప్పవచ్చు. గతేడాదిలో తెలంగా ణ సాధారణ గురుకులాలు 92.53 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ సంవత్సరంలో 92.90 శాతంతో రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నాయి. మైనారిటీ గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలల్లో గత ఏడాదిలో వరుసగా 83.65 శాతం, 77. 42 శాతం నమోదు కాగా, ఈ సంవత్సరం వరుసగా 82.2 శాతం, 79.1 శాతం నమోదైంది. ఉత్తీర్ణతలో మైనార్టీ గురుకులాల్లో ఉత్తీర్ణత శాతం 1.45 శాతం మేరకు కొంత తగ్గింది. కానీ, కేజీబీవీలలో 1.68 శాతం మేరకు ఫలితాలు పెరిగాయి.

ప్రభుత్వ జూ నియర్ కళాశాలలు, ఆదర్శ కళాశాలలు, మహాత్మ జ్యోతిబా ఫూలే కళాశాలలు, షెడ్యూల్ తెగల గురుకుల కళాశాలలు, సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో ఉత్తీర్ణత గత సంవత్సరంలో వరుసగా 49.13 శాతం, 62.42 శాతం, 82.87 శాతం, 81.52 శాతం, 83.23 శాతం నమోదైంది. కాగా, ఈ ఏడాదిలో వరుసగా 53.44 శాతం, 62.52 శాతం, 82.98 శాతం, 81.53 శాతం, 84.38 శాతంతో గతేడాది కంటే ఈ సంవత్సరంలో ఉత్తీర్ణత శాతాలు ఒక మోస్తారుగా పెరిగాయని చెప్పవచ్చు. మహాత్మ జ్యోతిబా ఫూలే కళాశాలల్లో 0.89 శాతం ఉత్తీర్ణత శాతం గత సంవత్సరం కంటే తగ్గింది. కానీ, ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో గతేడాది కంటే ఈ సం వత్సరం 4.31 శాతం ఫలితాలు పెరిగాయి.

దీనికిగల కారణాలను విశ్లేషించుకుంటే, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పలు విద్యా విషయక (అకాడమిక్) సంస్కరణలు చేపట్టడం కనిపిస్తుంది. వాటిలో ముఖ్యంగా 2024 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు సంవత్సరం పొడుగునా రెగ్యులర్ తరగతులతో పాటు ఈప్‌సెట్, నీట్, జేఈఈ పోటీ పరీక్షల కోసం ఉచిత కోచింగ్ సదుపాయం కల్పించడం జరిగింది. పేరెంట్- టీచర్స్ మీటింగ్ నిర్వహణ, వార్షిక పరీక్షలకై 90 రోజుల కార్యాచరణ (యాక్షన్ ప్లాన్) అమలు చేయడం, డిసెంబర్ నెలాఖరుకల్లా సిలబస్ పూర్తి చేసేలా కార్యచరణ అమలు, ఉత్తీర్ణత శాతం పెంచడానికి క్షేత్రస్థాయి పరిశీలకులుగా (ఫీల్ ఆఫీసర్స్‌గా) హెచ్‌ఓడీ లను నియమించడం వంటివి జరిగాయి.

హెల్ప్ ప్రోగ్రామ్ అమలు తీరు, తరచూ గైర్హాజరైన విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యప్రణాళిక (కరికులం) అమలు జరుగుతుం దా? లేదా? కళాశాలలలో డ్రాపౌట్స్ ఎం దరున్నారు? వారి వివరాలు, అదే విధంగా అర్ధ వార్షిక పరీక్షలలో తక్కువ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థు ల వివరాలు తెలుసుకుని పలు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఉత్తీర్ణతా శాతం పెంచడానికి గౌరవ డైరెక్టర్ సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ అధికారులతో (డీఐఈవో) ఇన్‌స్పెక్షన్ రిపోరట్స్ తెప్పించుకో వడం వంటివన్నీ గురుకుల కళాశాల ల్లో మెరుగైన ఫలితాలు పొందటానికి ప్రధానంగా దోహదపడిన అంశాలుగా ఉన్నాయి.


మౌలిక వసతులు అత్యవసరం

అన్ని వసతులతో కూడిన పూర్తిస్థాయి ఉచిత రెసిడెన్షియల్ సౌకర్యాలు, మాదిరి ప్రశ్నాపత్రాల తయారీద్వారా వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తూ, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ సమ కూర్చడం, తరచూపై అధికారుల పర్యవేక్షణ, పూర్తిస్థాయి సౌకర్యాలతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కాలేజెస్‌ని ఏర్పాటు చేసి ప్రతిభ కలిగిన విద్యార్థులను జాతీయస్థాయి పరీక్షలకు సంసిద్ధులను చేయ డం.. వంటివన్నీ పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రధానంగా రెసిడెన్షియల్ సదుపాయాలు లేకపోగా, కనీసం మధ్యాహ్న భోజన పథక సదుపాయాలు కూడా లేవు.

గురుకులాల్లో మాదిరి ప్రశ్నాపత్రాల తయారీకి సంబంధించిన ఏర్పాటు చేయకపోవడం, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కాలేజెస్ అనేవి ఏర్పాటు చేయక పోవడం, గ్రామీణ నేప థ్యం కలిగిన పిల్లలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరడంతో వారు తల్లిదండ్రులకు సహకారిగా ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్లడంతో రోజు తరగతులకు హాజరు కాకపోవటం, హాజరు శాతం తక్కువగా ఉండటం వల్ల ఫలితాలు తక్కువగా నమోదు అవడం వంటివి కారణమవుతున్నాయి. కనుక, ప్రభుత్వం వెంటనే స్పం దించి అన్ని కళాశాలలో మౌలిక వసతుల కల్పన చేసినట్లయితే ఇకముందు కూడా ఇంకా అత్యుత్తమ ఫలితాలు పొందవచ్చని ఆశిద్దాం.

వ్యాసకర్త: డాక్టర్. షేక్ జాన్ పాషా సెల్: 7386847203