09-08-2025 03:14:35 AM
సీఎస్‌కు మాజీమంత్రి హరీశ్‌రావు వినతి
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన పూర్తి నివేదికను ఇవ్వాల ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మాజీమంత్రి హరీశ్‌రావు కోరారు. శుక్రవారం ఆయన సచివాలయానికి వెళ్లి సీఎస్ రామకృష్ణారావును కలిశారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదిక ప్రతులను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేసీఆర్, హరీశ్‌రావు పేరుతో వేర్వేరు వినతిపత్రాలను అందజేశారు. అనంతరం వినతిపత్రాలు ఇచ్చినట్టు రశీదులు కూడా తీసుకున్నారు.
హరీశ్‌రావు విజ్ఞప్తిని పరిశీలించి చెబుతామని సీఎస్ చెప్పినట్టు సమా చారం. హరీశ్‌రావు వెంట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కాళేశ్వరం ప్రా జెక్టు నిర్మాణంలోని అవకతవకలపై విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల నివే దికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికను క్యాబినెట్ ఆమోదించింది. అసెం బ్లీలో చర్చకు పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కమిషన్ రిపోర్టును తమకు ఇవ్వాలని హరీశ్‌రావు కోరడం ఆసక్తిగా మారింది.