calender_icon.png 18 October, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిపో మేనేజర్లతో రీజనల్ మేనేజర్ సమీక్ష

17-10-2025 12:46:18 AM

కరీంనగర్, అక్టోబరు 16 (విజయ క్రాంతి): ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 మంది డిపో మేనేజర్లతో కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి. రాజు కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరములో సమీక్షా సమావేశము నిర్వహించారు. ఈ సమావేశము లో ఆర్థిక సంవత్సరము 2025-26 మొద టి, రెండవ త్రైమాసికాలకు అన్ని డిపోల పనితీరును, ఆర్థిక పరిస్థితిని సమీక్షించారు.

బతుకమ్మ- దసరా పండగల సందర్భంగా ప్రకటించిన దసరా స్పెషల్ లక్కీ డ్రా విజేతలు కరీంనగర్ చెందిన ఇ. రమేష్ కు 25 వేలు, గోదావరిఖనికి చెందిన సదానందంకు 15 వేలను అందజేసి సన్మానించారు. మూడవ బహుమతి విజేత జగిత్యాల కు చెందిన కె. నాగరాజు అందుబాటులో లేని కారణంగా చెక్కు అందజేయలేదు.

ఈ సమావేశములో డిప్యూటీ రీజినల్ మేనేజర్లు భూపతిరెడ్డి, మల్లేశం, డిపో మేనేజర్లు ఎం. నాగభూషణం, ఎన్. వెంకన్న, వి. రవీంద్రనాథ్, ఐ. విజయమాధురి, ఎం. శ్రీనివాస్, వి. శ్రవణ్ కుమార్, కె. కల్పన, ఎన్. మనోహర్, టి. దేవరాజు, టి. ప్రకాష రావు, బి. శ్రీనివాస్,పాల్గొన్నారు.