calender_icon.png 14 November, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మక్కలు, సోయాబీన్ కొనుగోళ్ల నిబంధనలు సడలించండి

14-11-2025 12:44:36 AM

కేంద్రానికి రాష్ట్ర మంత్రి తుమ్మల లేఖ 

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) : మొంథ తుఫా ను, అకాల వర్షాలు, అనిశ్చిత వాతావరణం కారణంగా సోయాబీన్, మొక్కజొన్న, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సేకరించే సోయాబీన్, పత్తి పంటల విషయంలో కొన్ని ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, గిరిరాజ సింగ్‌కు మంత్రి తు మ్మల గురువారం రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో సోయాబీన్ పంటకు కోత సమయంలో కురిసిన అకాల వర్షాల వల్ల గింజల్లో రంగు మారడం వంటి సమస్యల వల్ల నిబంధనలకు అనుగుణంగా పం ట రావడం లేదన్నారు. కేంద్రం నిబంధనలు సడలించి సోయాబీన్ కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మొక్కజొన్నకు మార్కెట్‌లో ధర క్వింటాళ్లకు రూ.1,959కు పడిపోయి, కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ. 2,400 రాకపోవడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతుందన్నారు.

రాష్ర్ట ప్రభుత్వమే స్వయంగా రంగంలోకిదిగి 48,757 మెట్రిక్ టన్నుల మొక్కలను కొనుగోలు చేసి 14,519 మంది రైతులకుప్రయోజనం కల్పించినట్లు తెలి పారు.  ఈ నేపథ్యం లో ఎంఎస్‌పీ కింద మొత్తం 16.85 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు నాపెడ్, ఎన్‌సీసీఎఫ్ సంస్థలకు అనుమతి ఇవ్వాలన్నారు.

పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ ప్రతిపాదించిన ఎకరాకు 7 క్వింటాళ్ల పరిమితి నిర్ణయం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు.  మోంథా తుఫాను ప్రభా వంతో పత్తి పంట దెబ్బతిన్న పరిస్థితుల్లో తేమ శాతాన్ని సడలించాలని, ఎకరాకు 11. 74 క్వింటాళ్ల దిగుబడి ఆధారంగా పత్తి కొ నుగోలు చేయాలని కేంద్రమంత్రిని తుమ్మల కోరారు.