calender_icon.png 2 November, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పయనీర్ వరి విత్తనాలపై రైతులకు అవగాహన

01-11-2025 04:50:12 PM

దౌల్తాబాద్: మండలంలోని శేరిపల్లి బందారం మధిర గ్రామం నర్సంపేట గ్రామంలో రైతులకు సన్నరకం వరి విత్తనాలపై పయనీర్ సీడ్స్, సంగమేశ్వర ట్రేడర్స్ దౌల్తాబాద్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతు కనకయ్య పొలంలో సాగు చేస్తున్న 27పి39 రకం వరి పంటను రైతులు సందర్శించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు అశోక్ రెడ్డి, భాను ప్రకాష్ మాట్లాడుతూ పయనీర్ వరి విత్తనాలు తెగుళ్లను సమర్థంగా తట్టుకుని,అధిక దిగుబడి ఇస్తుందని తెలిపారు. నాగప్ప మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు పయనీర్ సీడ్స్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు అరవింద్, రాజ్ కుమార్ తదితరులున్నారు.