07-05-2025 12:48:01 AM
చేవెళ్ల, మే 6:మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. మంగళ వారం తహసీల్దార్ కె.గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్ ఐ రోజా , అదనపు ఆర్ ఐ రాజేష్ నేతృత్వంలో రెండు బృందాలు స్థానిక పోలీసుల సహకారంతో కూల్చి వేతలు చేపట్టారు.
ఉదయం చిల్కూర్ పరిధిలోని ప్రభుత్వ శిఖం భూమి సర్వే నెం 457 లో అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డును జేసీబీతో కూల్చి వేశారు. అలాగే ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ కి వేసిన రోడ్డును త్రవ్వి క్లోజ్ చేశారు. మధ్యాహ్నం అజీజ్ నగర్ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నెం. 49 లో ఎకరం భూమిలో నిర్మిస్తున్న రెండు గదులను నేలమట్టం చేశారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది బాలకృష్ణ, ఎల్లయ్య, వాటర్ వరక్స్ సిబ్బంది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.