calender_icon.png 7 May, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.కోటి 70 లక్షలతో ఏరియా ఆసుపత్రి ఆధునీకరణ

07-05-2025 12:47:58 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్ చెరు, మే 6 :రూ.కోటి 70లక్షలతో పటాన్ చెరు ప ట్టణంలోని టంగు టూరి అంజయ్య ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు పటాన్ చెరు ఎమ్మె ల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.  మంగళవారం ప్రభుత్వ ఏరి యా ఆసుపత్రిలో రూ.70 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ..

వంద పడకలతో ఏ ర్పాటు చేస్తున్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల సంఖ్యకు అనుగుణంగా సౌక ర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రి నిర్మించి దశాబ్ద కాలం పూర్తి కావడంతో  పైపులైన్లు, డ్రైనే జీలు, డోర్లు, ఫ్లోరింగ్ మరమ్మత్తుల కోసం ప్రభుత్వం ఇటీవల రూ.70 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధులతో పాటు ఏరియా ఆసుపత్రి పక్కనే నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిధుల నుండి మరో రూ.కోటితో ఏరియా ఆసుపత్రి మరమ్మతుల కోసం కేటాయించబోతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, ఆసుపత్రి  సలహా సంఘం కమిటీ సభ్యులు కంకర సీన య్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, టీఎస్‌ఎంఐడిసి ఏఈ రవీందర్ రెడ్డి, ఆసుపత్రి ఆర్‌ఎంవో ప్రవీణ, డాక్టర్ సల్మా తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్లకు సంబంధించిన 101 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.46 లక్షల  విలువైన చెక్కులను ఎమ్మెల్యే  మహిపాల్ రెడ్డి పంపిణీ  చేశారు.