calender_icon.png 25 May, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరుకు ఫ్యాక్టరీని పునరుద్దరించండి

24-05-2025 01:02:21 AM

సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి వినతి పత్రం అందజేత

పటాన్ చెరు, మే 23 : జహీరాబాద్ లో మూతబడిన చెరుకు ఫ్యాక్టరీని  పునరుద్దరించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. శుక్రవారం జహీరాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి పలు సమస్యలను విన్నవించారు. 

 జహీరాబాద్ లో చెరుకు రైతులు ఎక్కువగా ఉన్నారని వారిని దృష్టిలో పెట్టుకొని మూతబడిన ట్రైడెంట్  చక్కెర కార్మాగారాన్ని తిరిగి పునరుద్దరించాలని కోరారు. అలాగే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జహీరాబాద్ ప్రాంతంలో విద్యార్థుల కోసం ఐటీఐ, డైట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ రాతపూర్వకంగాసీఎంనుకోరారు