24-05-2025 01:00:22 AM
జహీరాబాద్, మే 23: మెదక్‌లోని సింగూర్ ప్రాజెక్టును ఎకో టూరిజంగా మా ర్చేందుకు నిధులు మంజూరు చేస్తానని సీ ఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గంలో రూ. 494.67 కోట్లతో పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. అంతకు ముందు హుగ్గెళ్లి చౌరస్తాలో మహా త్మా బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఝరాసంగంలో కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభించి విద్యార్థులతో మా ట్లాడారు.
అనంతరం పస్తాపూర్‌లో ఏర్పా టు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. మెతుకు సీమకు తలమా నికంగా ఉన్న సింగూరు ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు తాగునీరు అందుతుందని, అలాం టి ప్రాజెక్ట్‌ను టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న మంత్రి దామోదర, ఎం పీ సురేశ్ షెట్కార్ కోరిక మేరకు అంగీకరిస్తున్నట్టు చెప్పారు.
ఇందిరమ్మకు అం డగా ఉన్న మెదక్ జిల్లా ప్రజల అభివృద్ధికి కాం గ్రెస్ ప్రభుత్వం కట్టబడి ఉందన్నారు. ము ఖ్యంగా జహీరాబాద్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ హయాంలోనే నిమ్జ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జహీరాబాద్ అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల తో కలిసి కార్యాచరణ రూపొందించి, నిధు లు మంజూరు చేస్తామని తెలిపారు.
దీం తో పాటు నారాయణ్‌ఖేడ్ అభివృద్ధికి సై తం నిధులు మంజూరు చేస్తానని సీఎం హామీనిచ్చారు. ప్రమాదాల నివారణకు జిల్లాలో ఉన్న జాతీయ రహదారులకు అవసరమైన చోట కేంద్రం సహాయంతో అండర్ పాస్‌లు నిర్మిస్తామన్నారు. రైతుల సంక్షేమ కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు.
చెరుకు రైతులు సహకార సంఘంగా ఏర్పడి ముందుకొస్తే, నిమ్జ్‌లో వంద ఎకరాల స్థలం కేటాయిస్తామని, నిమ్జ్‌లో భూములు కోల్పోయిన కు టుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూ రు చేస్తామని చెప్పారు.
సభలో వైద్య, ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనరసింహ, అటవీ శాఖమంత్రి కొండా సురేఖ, ఎంపీ సురేశ్‌షెట్కార్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, మాణిక్యరావు, మదన్మోహన్‌రావు, లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐ సీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, నా యకులు జగ్గారెడ్డి, నీలం మధు, గిరిధర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.
రూ.494.67 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు
జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి రూ.494.67 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.100 కోట్లతో నిర్మించిన 9 కిలోమీటర్ల గ్రీన్ కారిడార్ నిమ్జ్ రోడ్డును, రూ.100 కోట్లతో జహీరాబాద్‌లో నిర్మించిన రైల్వే ఫ్లుఓవర్ బ్రిడ్జిని సీఎం ప్రారంభించారు.
చిరాగ్‌పల్లి ఇప్పపల్లి మధ్య రూ.20 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశా రు. రూ.2 కోట్లతో మూడు షిప్టుల వారీగా మహిళా సహకార సంఘాలతో నిర్వహించే ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్‌ను ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు, మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు.