calender_icon.png 27 January, 2026 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉమ్మడి జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

27-01-2026 12:19:29 AM

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి, జనవరి 26(విజయక్రాంతి): భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి వివరాలను సంక్షిప్తంగా వివరించారు. వేడుకల్లో భాగంగా డీఆర్డీఓ, హౌసింగ్, వైద్య ఆరోగ్య శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అగ్నిమాపక శాఖ, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో శకట ప్రదర్శనలు నిర్వహించారు.

స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి ప్రశంసా పత్రాలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ఆరు పాఠశాలలకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఉత్తమ శకటాలుగా ఎంపికైన డీడబ్ల్యూఓ, డీఆర్డీఓ, జిల్లా రవాణా శాఖ, పోలీస్ శాఖలకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు.

కులాంతర వివాహాలు చేసుకున్న 41 జంటలకు ఒక కోటి రెండు లక్షల 50వేల రూపాయల చెక్కును అందజేశారు. తొమ్మిది మంది దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశారు. వీరిలో ఐదుగురికి ల్యాప్టాప్లు, ఒకరికి ట్యాబ్, ముగ్గురికి 5జీ మొబైల్ ఫోన్లు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్, టి జి ఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతి, రెవిన్యూ డివిజనల్ అధికారులు రాజేందర్, దేవుజా, అధికారు లు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

వివిధ ప్రభుత్వ పథకాల శకటాలు ప్రదర్శన 

మెదక్, జనవరి 26(విజయ క్రాంతి): భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 77 రిపబ్లిక్ డే వేడుకలను ఘ నంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి కలెక్టరేట్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అ నంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. మెదక్ నియోజక వర్గ శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, ఎస్పీ డి. వి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అంతకుముందు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో, జిల్లా పాలనాధికారి కలెక్టర్ మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశం గణతంత్ర దేశముగా ఏర్పడి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా విచ్చేసిన స్వాతంత్ర స మరయోధులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా పౌరులకు, అధికారులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు నా నమస్కారాలు మరియు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగఫలంగా సిద్దించిన స్వా తంత్య్ర ఫలాలు అందరికీ అందాలని డా|| బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే పెద్దదైన, గొప్పదైన భారత రాజ్యాంగాన్ని రచించి 26-01-1950 రోజున మనకు అందించారు. ఈ సందర్భంగా రా జ్యాంగ నిర్మాతలైన ఆ మహానీయులను గు ర్తుచేసుకొనుట మన భాద్యత అని గుర్తు చేశారు.

పాపన్న పేట్‌లో..  

పాపన్నపేట, జనవరి 26: మండల కేం ద్రం పాపన్నపేట తోపాటు ఆయా గ్రామా ల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆ యా గ్రామ పంచాయితీల్లో సర్పంచులు, ప్ర భుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, ఆసుపత్రులు, వివిధ సం ఘాల కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం వద్ద ఆలయ ఈవో చంద్రశేఖర్ జెండా ఆవిష్కరణ చేశారు.

చేగుంటలో...

చేగుంట జనవరి 26, చేగుంట మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మండలం లోని అన్ని పట్టణం, పంచాయతీ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం, తహసి ల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాల యం, పోలీస్ స్టేషన్ తో పాటు అన్ని ప్రభు త్వ కార్యాలయాల్లోనూ జెండా ఎగరవేశారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో జెండా ఎగురవేయడంతో పాటు చిన్నారులకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి బహు మతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు, వివిధ పార్టీ ల అధ్యక్షులు, ఆయా శాఖల మండల అధికారులు, వివిధ పార్టీల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రేగోడ్ మండలంలో...

రేగోడు జనవరి 26: మండల కేంద్రమైన రేగోడు తోపాటు ఆయా గ్రామాల్లోని ప్రభు త్వ ప్రైవేటు కార్యాలయాల వద్ద జాతీయ ఆవిష్కరించి జెండాను ఘనంగా గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు, తహసిల్దార్ కా ర్యాలయం వద్ద తహసిల్దార్ దత్త రెడ్డి, పో లీస్ స్టేషన్ వద్ద ఎస్‌ఐ పోచయ్య, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో సీతారావమ్మ, బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద రేగోడు బిఆర్‌ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రాచోటి సుభాష్ , ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ డిప్యూటీ స్పీకర్ జిల్లా బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులురాలు పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్, జనవరి 26 (విజయక్రాంతి): మెదక్ జిల్లా కేంద్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ కా ర్యాలయ ప్రాంగణంలో గణతంత్ర దినోత్స వ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మె ల్సీ ఫారుక్ హుస్సేన్, మెదక్ పట్టణ నాయకులతో కలిసి గాంధీ, బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ జిల్లా ప్రజల కు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

స్వతంత్ర ఉద్యమంలో మహనీయుల సేవలను, ప్రాణత్యాగాలను కొని యాడారు.స్వతంత్ర సమరయోధులను స్మ రించుకొని వారి ఆదర్శాలకు పునరాంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు హక్కుల పోరాటం కో సం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టి జగపతి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, కో కన్వీనర్లు కృష్ణ గౌడ్, లింగారెడ్డి, జుబేర్ అహ్మద్, మాజీ కౌన్సిలర్లు ఆర్కే.శ్రీనివాస్, జయరాజ్, కిషోర్, సోహెల్, చంద్రకళ, జ్యోతి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎన్జీవో రిపబ్లిక్ డే జెండా ఆవిష్కరణ

మెదక్, జనవరి 26 (విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయంస్థానిక టీఎన్జీవో భవన ఆవరణలో జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ జాతీయ పతాకావిష్కరణ గావించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మిత మహనీయులను స్మరించుకున్నారు. ఇరిగేషన్ డిఈ నందకిషోర్, టీఎన్జీవో సహాధ్యక్షులు ఇక్బాల్ పాషా, ఉపాధ్యక్షురాలు లీలా, సంయుక్త కార్యదర్శులు కిరణ్, రాధ, ఆర్గనైజింగ్ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఏఈఈ లు విక్రమ్, వెంకటేష్, సతీష్, టీఎన్జీవో నాయకులు దుర్గయ్య, సంతోష్, హరికృష్ణ, శ్రీకాంత్, శేఖర్ తదితరు ఉద్యోగులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి ఫోన్, ఈమెయిల్ సేవలు

కొండాపూర్, జనవరి 26 :మండలంలోని మల్కాపూర్ గ్రామపంచాయతీ ఆధ్వ ర్యంలో నిర్వహించిన 77వ గణతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ సమస్యలను నేరుగా పంచాయతీ సభ్యులకు తెలియజేయడానికి సౌకర్యంగా ఉండే విధంగా గ్రామ పంచాయతీ తరపున ఫోన్ నంబర్ 8142111225, ఈమెయిల్ ఐడి, అలాగే ఫిర్యాదులుసలహా ల పెట్టెను అధికారికంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్, ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమా ర్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఏవైనా సమస్యలు, సూచనలు, అవసరాలు ఉంటే నేరుగా ఫోన్, ఈమెయిల్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపారు. ఈ వేడుకల్లో గ్రామ వార్డు సభ్యులు అజ్గర్, లక్ష్మణ్, ముస్కాన్ ఫాతిమా ఫాహీం, శ్వేతా అనంతయ్య, శ్రీశై లం, సౌజన్య నారాయణ చారి, దశరథ్, ఇం దిరమ్మ, రత్నం, సునంద శీను, నరేష్, సమాధానం అనిల్, ప్రవీణ్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 

మెదక్, జనవరి 26 (విజయ క్రాంతి) :77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జి ల్లా కలెక్టర్ రాహుల్ రాజ్  త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు .విద్యార్థిని విద్యార్థులకు మిఠాయి లు పంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ రాజ్యాంగ విలువలతో సమగ్ర అ భివృద్ధి లక్ష్యంగా జిల్లా ప్రగతి పదంలో నడవాలని అందుకు అధికారులు అందరూ స మన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ అధికారి రాజిరెడ్డి, క్యాంపు కార్యాలయ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.