calender_icon.png 27 January, 2026 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంగరలో పరిశుభ్రత ఉద్యమానికి శ్రీకారం

27-01-2026 12:19:54 AM

భీమదేవరపల్లి, జనవరి 26 (విజయక్రాంతి): భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో ‘ప్రతి నెల ఒక వార్డు’ పరిశుభ్రత కార్యక్రమాన్ని వంగర గ్రామ సర్పంచ్ గజ్జల సృజన రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో గ్రామంలో ‘ప్రతి నెల ఒక వార్డు’ అనే పరిశుభ్రత కార్యక్రమాన్ని పాలకవర్గం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ నెలకు ఎంపిక చేసిన వార్డులో చెత్తాచెదారం పూర్తిగా తొలగించడం, వీధులు డ్రైనేజీలను శుభ్రం చేయడం, ప్రజా ప్రదేశాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.

అలాగే గ్రామ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ, తడి పొడి చెత్తను వేరు చేయాలి, చెత్తను రోడ్లపై వేయకూడదనే అంశాలపై సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ ప్రజల సమిష్టి సహకారంతో నిర్వహించడం జరిగింది. గ్రామాన్ని ఆదర్శ గ్రా మంగా తీర్చిదిద్దే దిశగా, ఇదే తరహాలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల సహకారంతో చేపడతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వల్లాల రమేష్, గ్రామ కార్యదర్శి విన య్, వార్డు మెంబర్లు శ్రీరామోజు మొండయ్య , కాల్వ అంజలి కండే శారద , వేముల సాధన , మిడిదొడ్డి తిరుపతి, రఘునాయకుల మహేష్ గజ్జల రమేష్, రామారపు స్వరూప, బత్తిని రజిత , మాజీ సర్పంచ్ రఘునాయకుల వెంకటరెడ్డి చెప్పాలా తిరుపతి రెడ్డి ,చిట్టి సతీష్ రెడ్డి ,నల్లగొని ప్రభాకర్ కాల్వ సునీత సంపత్, బొల్లి రాజయ్య ,కడారి బాబు కండచక్రపాణి ,జమాల్ ,ఓల్లాల రవి రవి ,రోడ్డ అజయ్, గిద్దె ప్రవీణ్, మేదర సదానందం, గజ్జల రవి, కాల్వ సంపత్, గిద్దె సదానందం ,వల్లాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.