27-01-2026 12:18:34 AM
భీమదేవరపల్లి ,జనవరి 26 (విజయక్రాంతి)హుజురాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి ధర్మపత్ని శాలిని రెడ్డి వీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవికి కొత్తకొండ దేవాలయం లో కోడె మొక్కుబడి సమర్పించి స్వామివారికి కూష్మాండము గుమ్మ డి కాయ సమర్పణ వీరభద్ర స్వామికి అభిషేకము, భద్రకాళి దేవికి కుంకుమార్చన చేశారు. దేవస్థానం తరుపున పట్టు వస్త్రముతో సన్మానం, వేద ఆశీర్వాదములు కొత్తకొండ దేవాలయ ముఖ్య అర్చక మొగిలిపాలెం రాంబాబు అర్చక నందనం సందీప్ , అర్చక మొగిలిపాలెం శివకుమార్ , అర్చక నందనం శ్రవణ్ లు పాల్గొన్నారు.