27-01-2026 12:00:00 AM
దేశభక్తుల వేషధారణలో చిన్నారులు
తిలకించిన వందేమాతరం గీతం
గోపాలపేట జనవరి 26 : వనపర్తి జిల్లా గోపాలపేట, ఏదుల మండలాల్లో గణతంత్ర వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని తాసిల్దార్ కార్యాలయం లో తాసిల్దార్ తిలక్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వ్యవసాయ కార్యాలయం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం పోస్ట్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ గాంధీ విగ్రహం తోపాటు తదితర కార్యాలయాల్లో పాఠశాలల్లో వారికి సంబంధించిన అధికారులు అధ్యాపకులు ఉపాధ్యాయులు అదేవి ధంగా అన్ని అన్ని గ్రామాల గ్రామపంచాయతీలలో సంబంధిత అధికారులు సర్పంచులు జాతీయ జెండాను ఎగరవేశారు.
ముఖ్యంగా ట్రైనీ టోయిస్ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలో అలరించారు. దేశ నాయకుల స్లోకాలతో గ్రామంలోని పని కాలనీలలో ర్యాలీ తిరిగారు వారి వేషధారణకు ప్రజలు అబ్బర పో యారు. అదేవిధంగా జాతీయ జెండాను ఎగరవేసే సమయంలో వందేమాతర గీతా న్ని ప్రతి ఒక్కరూ తిలకించి ఆనందించారు. కార్యక్రమంలో ఆయా శాఖ అధికారులు రాజకీయ నాయకులు ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు.
అయిజలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
అయిజ జనవరి 26 జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రం తో పాటు ఆయా గ్రామాల్లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మున్సిపల్, ఎంపీడీవో, ఎంఈఓ మరియు మహిళ మండల సమాఖ్య కార్యాలయాల్లో ఆయా సంబంధిత శాఖ అధికారులు జెండా ఆవిష్కరణ చేశారు. తాహసిల్దార్ కార్యాలయంలో తాహసీల్దార్ జ్యోతి జెండా ఎగరవే శారు.ఆమె మాట్లాడుతూ... గణతంత్ర దినోత్సవ ఆవశ్యకతను వివరించారు.ఆయా గ్రామాల నుండి సమస్యలపై కార్యాలయాలకు వచ్చే ప్రతి ఒక్కరికి సాధ్యమైనంతవరకు సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తామని అన్నారు. ఈ కార్యక్రమాలలో ఆయా కార్యాలయాల అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం
కల్వకుర్తి జనవరి 26: 77వ గణతంత్ర దినోత్సవాన్ని కల్వకుర్తి పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేటు విద్యాలయాలు కార్యాలయ వద్ద ధికారులు ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరవేశారు . కార్యాలయం వద్ద కమీషనర్ మహమ్మద్ షేక్ పతాకాన్ని ఎగరవేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థుల పలు సంస్కృతి కార్యక్రమాలు
అలంపూర్, జనవరి 26: అలంపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజా ప్రతినిధులు, అధికారులు విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. మానవపాడు మండల కేంద్రంలో తహసిల్దార్ శ్రీనివాస్ జోషి శర్మ , ఎంపీడీవో రాఘవ, ఎంఈఓ శివప్రసాద్ ఎస్త్స్ర స్వాతి వారి వారి కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకల ఆవశ్యకతను కొనియాడారు.
జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే
అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే విజయుడు 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మహనీయుల చరి త్రను వివరించారు. అదేవిధంగా ఎర్రవల్లి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ లో గణతంత్ర దినోత్సవ వేడు కలను విద్యార్థుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.కరస్పాండెంట్ మధులిక గోవర్ధ న్ రెడ్డి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.అనంతరం విద్యార్థులు వేసిన స్వాతంత్ర సమరయోధుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు పురవీధుల గుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అల్లంపూర్ పట్టణంలో మాంటి సోరి స్కూల్ లో డైరెక్టర్ రవి ప్రకాష్ జాతీయ జెం డాను ఆవిష్కరించి విద్యార్థులకు అమూల్యమైన సందేశాన్ని అందించారు. అనంతరం భారతదేశ చిత్రపట ఆకృతిలో విద్యార్థులు చేసిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి.
ఉద్యోగులకు అవార్డులు అందించిన కలెక్టర్
మహబూబ్ నగర్, జనవరి 26 (విజయ క్రాంతి) : భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వా రా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గు రించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా పరేడ్ గ్రౌండ్ మైదానంలో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రద ర్శించిన శకటాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న సేవలను ప్రతిబింబించే విధంగా ఈ శకటాలను రూపొందించారు. ఈ శకటాల ప్రదర్శనలో వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, పురపా లక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ ,మహిళా శిశు సంక్షేమ శాఖ,అటవీ శాఖలు పాల్గొని తమ శాఖల పనితీరును వినూత్నంగా ప్రదర్శించాయి. ఈ శకటాల ప్రదర్శన ద్వారా ప్రభుత్వ శాఖలు చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక శోభ చేకూరిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
అంతకుముందు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహబూబ్ నగర్ శాసన స భ్యులు యెన్నం శ్రీనివాస రె డ్డి, ఎస్.పి.డి జానకి, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్ నాయక్,అదనపు ఎస్.పి. ఎన్ .బి.రత్నం, రాష్ట్ర మైనార్టీ ఫై నాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వా ల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. స మీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కలెక్టరేట్ ఏ.ఓ సువర్ణ రాజ్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
దేశం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది
మహబూబ్ నగర్, జనవరి 26 (విజయ క్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అద్భుతంగా రాశారని, భారతదేశం ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నా రు. సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పార్టీ కార్యాలయం లో జాతీయ జెండాను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఇతర దేశాలతో సమానంగా అభివృద్ధి సాదించాలన్నారు. అక్కడక్కడ మహిళల పట్ల జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
కరువుతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రములో కెసిఆర్ గారి నాయకత్వంలో తాగు.. సాగునిరు తెచ్చుకున్నాం.. విద్య.. వైద్య రంగాలని సైతం అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమం లో గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ము డా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మహబూబ్ నగర్ మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ వెంకటయ్య, సీని యర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, గణేష్, కో ట్ల నర్సింహా, వెదవత్, రాము, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు
జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు...
వనపర్తి, జనవరి 26 (విజయక్రాంతి): జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాకుండా, ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య, వైద్యం అందించి వారి ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జిల్లా ఎ స్పీ డి. సునీత రెడ్డి, స్థానిక శాసన సభ్యు లు తూడి మేఘా రెడ్డి, రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం, పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి, వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సా ధించిన ప్రగతిపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అందజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించడమే లక్ష్యం.
గద్వాల, జనవరి 26 (విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వా రందరికీ అందించడమే లక్ష్యంగా జోగులాంబ గద్వాల జిల్లా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగా యి. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముం దు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అనంతరం పలువురు ప్రజా ప్రతిని ధులను, పుర ప్రముఖులను, అధికారులను కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులకు సంబందించి విషయాలను ప్రజలకు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.