calender_icon.png 27 January, 2026 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేం సార్ మాకు బడి కట్టించండి..సీఎం సలహాదారున్ని అభ్యర్థించిన విద్యార్థులు

27-01-2026 12:11:19 AM

కేసముద్రం, జనవరి 26 (విజయక్రాంతి): వేం సార్ కేసముద్రం పట్టణ అభి వృద్ధితో పాటు డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలను   నిధులు మంజూరు చేస్తున్నారు. మా కు మాత్రం బడి లేక ఆరుబయట వరండాలో ప్రైవేటు వ్యక్తుల ఇండ్లలో చదువు కోవాల్సిన దుస్థితి నెలకొంది.

మాకు పక్కా భవనం నిర్మించి సౌకర్యాలు కల్పించి విద్యాభివృద్ధికి సహాయపడాలని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని కలిసి కేసముద్రం పట్టణ పరిధిలోని బ్రహ్మంగారి తండా ప్రభుత్వ ప్రాథమిక పా ఠశాల విద్యార్థులు అభ్యర్థించారు.

25 సంవత్సరాలుగా పాఠశాలకు భవనం లేక అద్దె ఇంట్లో అరకొర వసతుల మధ్య చదువు సా గించడం వల్ల ఇబ్బంది కలుగుతోందని, అర్ధాంతరంగా వదిలేసిన పాఠశాల భవనాన్ని పూర్తి చేయించాలని వేడుకున్నారు.