calender_icon.png 14 October, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళితులపై దాడులు చేస్తే శిక్షలు వేయాలి

14-10-2025 12:58:34 AM

ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి గుండ థామస్

కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 13(విజయ క్రాంతి): ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మత్రి అవార్డు గ్రహిత  మందకృష్ణ మాదిగరి ఆదేశాల మేరక  జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాలతో  నిరసన తెలిపారు.

వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి గుండ తామస్ , మాదిగ మంత్రి మల్లేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవ్ రావు మాదిగ మాట్లాడుతూ దేశంలో  దళితులపై దాడులు,హత్యలు, హత్యాచారా లు, దౌర్జన్యాలు, కుల దూషణలు, భూకబ్జా లు పెరిగిపోతున్నాయని వీటిని అరికట్టడంలో పాలకులు పూర్తిగా విఫలమవుతు న్నారన్నారని ఆరోపించారు.

ఇటీవలే సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తిపైనే దాడి చేయడం భారతదేశ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందన్నారు. దళితులపై దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలను పునరుద్ధరించి కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు  శీను మాదిగ, జిల్లా నాయకులు పిట్టల సత్యనారాయణ, సుదర్శన్, ప్రభాకర్, వెంకటేశం , శ్రీశైలం, మహేష్, విహెచ్‌పిఎస్ జిల్లా నాయకులు శంకర్, నందిపేట రామయ్య  నాయకులు పాల్గొన్నారు.