calender_icon.png 25 November, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రహ్మసూత్ర మరకత లింగాన్ని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్ దివి

25-11-2025 12:00:00 AM

శంకర్పల్లి: నవంబర్ 24:  శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో వెయ్యి ఏండ్ల క్రితం నాటి మహిమగల శ్రీ బ్రహ్మసూత్ర మరకత లింగాన్ని సోమవారం టాలీవుడ్ హీరోయిన్, బిగ్ బాస్ ఫేమ్ దీవీ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేసి దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆమె దర్శనాంతరం అర్చకులు ప్రమోద్ స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రచార కమిటీ చైర్మన్ దయాకరరాజు, సభ్యుడు గోపాల్ ఉన్నారు.