calender_icon.png 10 January, 2026 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సమాఖ్య భవనానికి స్థలాన్ని కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి

08-01-2026 12:00:00 AM

జనని మండల సమాఖ్య మహిళా సంఘం సభ్యులు

రేగొండ, జనవరి 7 (విజయక్రాంతి): కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ బుధవారం ఉదయం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ను హన్మకొండ నక్కల గుట్టలోని ఆయన స్వగృహంలో జనని మండల సమాఖ్య మహిళా సంఘాల సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం, బస్సులు, పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్ ల ద్వారా ఆర్ధికంగా వారి కాళ్ళపై వాళ్ళు నిలబడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వీ వో ఏ ల మండల సమాఖ్య అధ్యక్షులు సర్వు కుమారస్వామి,జనని మండల సమాఖ్య అధ్యక్షులు శోభ, సెక్రటరీ సుమలత, ట్రెజరరీ మమత, విజయ, స్వర్ణలత తదితరులు ఉన్నారు.