calender_icon.png 27 December, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారులు బాగు పడేనా..?

27-12-2025 02:05:27 AM

ఉట్నూర్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): ఉట్నూర్ డివిజన్ పరిధిలోని గ్రామాలకు ఏర్పాటు చేసిన తారు రోడ్లు గుంతలమయం అయ్యాయి.. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రోడ్డుల మరమ్మత్తులపై పట్టించుకోకపోవడంతో  రహదారులపై అడుగు అడుగున గుంతలు ఏర్పడ్డా యి. దీంతో పల్లె ప్రజలు ప్రాణాలను అరచేతు ల్లో పెట్టుకొని ప్రయాణం చేయవలసి  వస్తుం ది. డివిజన్ పరిధిలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల పరిధిలోని మారుమూల గ్రామాలకు ఏర్పాటు చేసిన తా రురోడ్లు ప్రయాణానికి నరకప్రాయంగా మా రాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మారుమూల గ్రామాల రోడ్ల అభివృద్ధికి రూ.36.98 కోట్లు మంజూరు చేసిన, రోడ్డు పనులు చేపట్టేందుకు గుత్తేదారు లు ముందుకు రావడంలేదని ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు రోడ్డు పనులను  ప్రారంభించేలా చర్య లు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.