28-01-2026 12:25:25 AM
ఖైరతాబాద్, జనవరి 2౭ (విజయక్రాంతి): ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతరలో సంస్కృతి, ప్రజల విశ్వా సం, ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై పరిశోధ న చేసిగ్రంథంను రచించినట్లు డాక్టర్ మల్లికార్జున నాయక్ వదితె తెలిపారు. 2018- వరకు ఫీల్డ్ వర్క్ చేసి పరిపాలనా రికార్డులు, మౌఖిక చరిత్రలు, విధానపరమైన అధ్యయనాల ఆధారంగా ఈ గ్రంథం రూపొందించి నట్లు వెల్లడించారు.
మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ గ్రంథాన్ని ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథకర్త డాక్టర్ మల్లికార్జున నాయక్ వదితెతోపాటు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వి. బాలకృష్ణారెడ్డి, సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్‌చైర్మన్ వై.ఎల్. శ్రీనివాస్, లోక్‌సత్తా పార్టీ ఫౌండర్ జయప్రకాష్ నారాయణ్, ఓయూ డీన్ బీ.సుధాకర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడారం జాతర మతపరమైన ఉత్సవంగా మాత్రమే కాదని, నైతిక విలువలు, ప్రజాకేంద్రీకృత పాలనా విధానాలు, గిరిజన జీవనతత్వం ఆధారంగా పనిచేసే సమగ్ర సా మాజిక వ్యవస్థగా లోతుగా విశ్లేషిస్తుందన్నారు.