calender_icon.png 2 January, 2026 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశ్రమ పాఠశాలలో 100% ఫలితాలు సాధించాలి

02-01-2026 12:12:52 AM

నిర్మల్, జనవరి ౧ (విజయక్రాంతి): ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ సంవత్సరం పదో తరగతిలో 100% ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఐటిడిఏ డిప్యూటీ డైరెక్టర్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీనాయక్ పిలుపునిచ్చారు. గురువారం నిర్మల్ జిల్లాలో ని బాలుర బాలికల గిరిజన ఆశ్ర పాఠశాలను సందర్శించి వివిధ పోటీ పరీక్షల్లో ప్రతిభ సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. మార్చి నెలలో జరిగిన పదో తరగతి పరీక్షలకు ప్రతి పాఠశాలలో చదివి విద్యా ర్థులను 100% ఫలితాలు సాధించేలా ఇప్పటినుండి కష్టపడి పని చేయాలని ఉపా ధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజమౌళి ఉపాధ్యాయులు గజ్జరం తదితరులు ఉన్నారు.